Children’s weight : పిల్లలు బరువు పెరగట్లేదా? అయితే ఇలా చేయండి

ఏడాది లోపు పిల్లలు అయితే వాళ్లకు మెత్తగా ఉడికించి పెట్టాలి. ఇంకా సిరలిక్ పెడుతున్నట్లయితే బార్లీ, మినుమలు, కందిపప్పు, డ్రైఫ్రూట్స్‌తో పౌడర్ చేసుకోవాలి. దీనిని ఇక్కిరిలా చేసి తినిపించాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగుతారు. రైస్ తినే పిల్లలు అయితే అన్నం వండుకొనేటప్పుడు అందులో కొంచెం కందిపప్పు, బార్లీ, క్యారెట్, బీట్‌రూట్ వంటివి ఉడికించుకోవాలి

Written By: Bhaskar, Updated On : August 19, 2024 8:54 pm

Children's weight

Follow us on

Children’s weight : పిల్లలను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్లకు ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని అడిగినవి అన్ని కొని ఇస్తుంటారు. అయితే కొందరు పిల్లలు పుట్టినప్పటే తక్కువగా బరువుతో పుడతారు. అలానే ఉంటారు కానీ మళ్లీ బరువు పెరగరు. చిన్నపిల్లలు బరువు తక్కువగా ఉండటం వల్ల వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయి. వాళ్ల వయస్సుకు తగ్గట్లుగా బరువు పెరుగుతుండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఆసుపత్రి పాలు కావడం తప్పదు. సాధారణంగా పిల్లలు చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు. తినట్లేదు కదా అని అలా వదిలేయకూడదు. ఏదో రకంగా వాళ్లకు నచ్చ చెప్పి తినిపించాలి. అయితే పిల్లలకు ప్రొటీన్ ఉండే ఆహారం పెట్టాలి. అప్పుడే వాళ్లు వయస్సుకు తగ్గట్లు బరువు పెరుగుతారు. తొందరగా బరువు పెరగాలంటే పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసుకుందాం.

ఏడాది లోపు పిల్లలు అయితే వాళ్లకు మెత్తగా ఉడికించి పెట్టాలి. ఇంకా సిరలిక్ పెడుతున్నట్లయితే బార్లీ, మినుమలు, కందిపప్పు, డ్రైఫ్రూట్స్‌తో పౌడర్ చేసుకోవాలి. దీనిని ఇక్కిరిలా చేసి తినిపించాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగుతారు. రైస్ తినే పిల్లలు అయితే అన్నం వండుకొనేటప్పుడు అందులో కొంచెం కందిపప్పు, బార్లీ, క్యారెట్, బీట్‌రూట్ వంటివి ఉడికించుకోవాలి. లేదా అన్నంలో కొన్నిసార్లు రాగిజావ కలిపి పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు తొందరగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే పిల్లలకు ఎక్కువగా ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం పెడుతుండాలి. రెండేళ్లకు దగ్గర అవుతున్న పిల్లలకు ఉడికించిన గుడ్లు తినిపించాలి. ఇందులో ప్రొటీన్ ఉండటం వల్ల పిల్లలు తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి రోజూ ఉదయం కనీసం ఒక గుడ్డు అయిన మీ పిల్లలకు పెట్టండి. అలాగే బిస్కెట్లు, రస్క్‌లు, చాక్లెట్లు, చిప్స్ వంటివి పిల్లలకు ఇవ్వద్దు. వీటివల్ల బరువు పెరుగుతారు. కానీ అది ఆరోగ్యం కాదు. పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరిగేలా చూడండి.

చాలామంది పిల్లలు పాలు తాగడానికి అంతగా ఇష్టపెట్టుకోరు. కానీ ఏదో రకంగా పిల్లలకి పాలు అలవాటు చేయండి. డైలీ ఉదయం, రాత్రి పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎక్కువ ప్రొటీన్స్ ఉండే సోయాబీన్స్, పప్పులు, తృణ ధాన్యాలను తినడం చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయండి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. ఎక్కువ గంటలు గ్యాప్ ఉండేలా కాకుండా గంటకి పిల్లలకు ఏదైనా తినిపించండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సరైన సమయానికి తినేలా చూసుకోండి. తినేటప్పుడు పిల్లలు టీవీ, మొబైల్ వంటి వాటికి దూరంగా ఉండేలా చూసుకోండి. అప్పుడప్పుడు వాళ్ల బరువును చెక్ చేస్తుండాలి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న పిల్లలు బరువు పెరగకపోతే బనానా, అవకాడో వంటి స్మూతీలు చేసి ఇస్తుండాలి. అరటి, అవకాడోలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల పిల్లలు తొందరగా బరువు పెరుగుతారు.