Iron Rich Food: పిల్లలకు 6నెలల నుంచి ఆహారం అందించడం ప్రారంభిస్తారు పేరెంట్స్. మరి ఈ ఆరునెలల నుంచి ఎలాంటి ఆహారం అందిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమే. మీరు ఇచ్చే ఆహారం వల్లనే పిల్లల ఎదుగుదల ఉంటుంది. వారికి ఇచ్చే మంచి ఆహారం వల్ల పోషకాలు, ప్రొటీన్లు, విటమిన్స్ బాగా అందుతాయి. మరి ఐరన్ బాగా ఉండే ఓ మంచి ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క ఫుడ్ ను మీ బేబీకి ఇచ్చారు అనుకోండి ఐరన్ కోసం మరే ఇతర ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.
ఐరన్ రిచ్ ఫుడ్ కోసం కావాల్సినవి క్యారెట్, బీట్ రూట్, నానబెట్టిన రైస్. అయితే క్యారెట్, బీట్ రూట్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ సమయంలో కొంచెం సమయం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ మూడింటిని ఒక పాత్రలోకి తీసుకొని ఉడకబెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన క్యారెట్, బీట్ రూమ్ ప్యూరీ రెడీ అయింది.
మంచి రుచితో పాటు రంగు కూడా ఉంటుంది. తినడానికి ఇబ్బంది పడినా కూడా తినిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఒకసారి వీటిని అలవాటు చేస్తే వారే తింటారు. కానీ ఈ ఫుడ్ లో మంచి ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. దీంతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. మరి తెలుసుకున్నారు. మీ పిల్లలకు ఈ సారి ఈ ఫుడ్ ను అందించండి. తర్వాత రిజల్ట్ ను మీరే చూస్తారు. తయారీ విధానం కూడా చాలా సింపుల్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మీ పిల్లలకు మొదటగా ఈ ఫుడ్ ను పెట్టిన తర్వాత వారికి డైజెస్ట్ అవుతుందా లేదా అనేది కూడా చూడండి. ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం బెటర్.