https://oktelugu.com/

Drinking Alcohol: మద్యం తాగేవారు కచ్చింతగా చూడాల్సిన వీడియో ఇదీ..

ముంబైకి చెందిన కొందరు విదేశీ మద్యం అమ్ముతున్నట్లు ప్రచారం చేసుకున్నారు. బ్లాక్‌లో ఫారిన్‌ మద్యం తెప్పిస్తున్నామని సీక్రెట్‌గా అడిగిన వారికి సరఫరా చేస్తున్నారు. ఫారిన్‌ మద్యం పేరుతో ఇందుకు భారీగానే వసూలు చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 28, 2024 / 03:21 PM IST

    Drinking Alcohol

    Follow us on

    Drinking Alcohol: మీరు మందు ప్రియులా.. ఫారిల్‌ లిక్కర్‌ ఎక్కువ డబ్బులు పెట్టి మరీ కొంటున్నారా.. అయితే మీ కిక్కు దిగిపోయే విషయమిది. సీలు ఉన్న విదేశీ మద్యం బాటిళ్లలో చీఫ్‌ లిక్కర్‌ చేరుతోంది. ఈ విషయం తెలియక చీఫ్‌ లిక్కర్‌నే కాస్ట్‌లీ మందు అందుకుని చాలా మంది లాగించేస్తున్నారు. తాజాగా ఈ దందా గుట్టును ముంబై ఎక్సైజ్‌పోలీసులు రట్టు చేశారు. దీనికి సబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్‌ అవుతోంది.

    విదేశీ మద్యం అమ్ముతామని..
    ముంబైకి చెందిన కొందరు విదేశీ మద్యం అమ్ముతున్నట్లు ప్రచారం చేసుకున్నారు. బ్లాక్‌లో ఫారిన్‌ మద్యం తెప్పిస్తున్నామని సీక్రెట్‌గా అడిగిన వారికి సరఫరా చేస్తున్నారు. ఫారిన్‌ మద్యం పేరుతో ఇందుకు భారీగానే వసూలు చేస్తున్నారు. అయితే, వాళ్లు అమ్ముతున్నది విదేశీ మద్యం కాదు. లోకల్‌ మద్యాన్నే విదేశీ సీసాల్లో నింపిన సరఫరా చేస్తున్నారు.

    ఎలా నింపుతున్నారంటే..
    విదేశీ మద్యం బాటిళ్లు కల్తీ చేయడానికి వీలుండదు. కానీ, ముంబైకి చెందిన ఓ ముటా ఈ బాటిళ్ల సీల్‌ను కూడా ఓపెన్‌ చేయడం నేర్చుకుంది. ఇంకేముంది.. ఫారిన్‌ లిక్కర్‌ బాటిళ్లను సేకరిస్తోంది. వాటిని రహస్యంగా ఓ గోదాంకు తరలిస్తోంది. ఇక అక్కడే అసలు దందా మొదలు పెడుతున్నారు. స్థానికంగా లభించే మద్యం సేకరించి.. వాటిని కూడా గోదాంకు తీసుకెళ్లున్నారు. అక్కడ ప్రత్యేక నిపుణులు ఫారిన్‌ సీసాల సీల్‌ను టెక్నిక్‌గా తొలగిస్తున్నారు. తర్వాత వాటిలో 60 మద్యం, 10 శాతం స్పిరిట్, మిగత 30 శాతం వాటర్‌ మిక్స్‌ చేస్తున్నారు. తర్వాత సీల్‌ యథావిధిగా వేస్తున్నారు.

    అనుమానం రాకుండా సీల్‌..
    ఇక లోకల్‌ మధ్యం బాటిళ్లలో నింపిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా సీల్‌ వేస్తున్నారు. ఓపెన్‌ చేసేందుకు ఒక స్క్రూడ్రైవర్, ఒక హీటర్‌ వాడుతున్నారు. స్క్రూడ్రైవర్‌ సాయంతో బాటిల్‌లోని సీల్‌ తెరుస్తున్నారు. తర్వాత హీట్‌ చేయడం ద్వారా దానిని పూర్తిగా తొలగిస్తున్నారు. లిక్కర్‌ ఫిల్‌ చేసిన తర్వాత కొత్త క్యాప్‌ వేసి.. మళ్లీ అనుమానం రాకుండా హీటర్‌ సాయంతో సీల్‌ వేస్తున్నారు. ఇందుకోసం క్యాప్‌లు, సీల్‌ను ప్రత్యేకంగా సమకూర్చుకుంది ఈ ముఠా.

    వొడ్కా, స్కాచ్‌ బాటిళ్లుగా విక్రయం..
    ఇలా కల్తీ చేసిన మద్యాన్ని ఈ ముటా వొడ్కా, స్కాచ్‌ బాటిళ్లు అని చెప్పి విక్రయిస్తోంది. ఇక అసలు విషయం తెలియని చాలా మంది ఫారిన్‌ మధ్యం తక్కువ ధకు వస్తోందని లోకల్‌ మద్యాన్నే లొట్టలు వేసుకుంటూ తాగుతున్నారు. తాజాగా ఈ ముఠా పట్టుబడడంతో ముఠా సభ్యులతో మద్యం కల్తీ చేసే విధానం గురించి వీడియో తీశారు. దానిని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌ అవుతోంది.