https://oktelugu.com/

Heroine: ఒకే హీరోయిన్ ను ప్రేమించిన హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. అలాగే ప్రేమించి పెళ్లిదాకా వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 28, 2024 / 03:18 PM IST

    hero and director who loved same heroine

    Follow us on

    Heroine: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు తమ సహచర నటులతో నటిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లతో ప్రేమలో పడడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇక ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

    అలా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. అలాగే ప్రేమించి పెళ్లిదాకా వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇలాంటి క్రమంలోనే గులాబీ సినిమా చేస్తున్న సమయంలో జెడి చక్రవర్తి , ఆ సినిమాలో హీరోయిన్ అయిన మహేశ్వరి ని ప్రేమించాడట. ఇక ఆ సినిమా డైరెక్టర్ అయిన కృష్ణవంశీ కూడా మహేశ్వరి ని ప్రేమించినట్టుగా అప్పట్లో వార్తలైతే వస్తున్నాయి.

    వీళ్లిద్దరూ ఒక అమ్మాయినే ప్రేమించడం ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు. కానీ తన సహ నటి అయినందు వల్ల జెడీ చక్రవర్తి తన సినిమాలో హీరోయిన్ అయినందువల్ల కృష్ణవంశీ ఇద్దరు లవ్ చేయడంలో తప్పులేదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే గులాబీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడంతో పాటుగా అటు జేడి చక్రవర్తి కృష్ణవంశీ ఇద్దరు కెరియర్లు ఒకేసారి గాడిలో పడ్డాయనే చెప్పాలి. మహేశ్వరి కూడా ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా తెలుగులో చేసుకుంటూ ముందుకు సాగింది. ఇక ఈ సినిమా తర్వాత వడ్డె నవీన్ తో కలిసి ఆమె చాలా సినిమాల్లో నటించింది. అందులో ముఖ్యంగా పెళ్లి సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది.

    ఇక మొత్తానికైతే మహేశ్వరి ప్రేమలో దర్శకుడు పడడం అనేది పంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే కృష్ణవంశీ ప్రస్తుతం సినిమాలు ఏమి చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. అలాగే చక్రవర్తి కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటున్నాడు…