https://oktelugu.com/

Foods For Brain: ఈ మూలికల వల్ల మీ బ్రెయిన్ సూపర్ షార్ప్ అవుతుంది..

అద్భుతమైన మూలిక అశ్వగంధ. దీన్ని వాడటం వల్ల మతిమరుపు వంటి సమస్యలు దూరం అవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బ్రెయిన్ హెల్త్‌ని కాపాడుతుంది. ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 15, 2024 / 06:24 AM IST

    Foods For Brain

    Follow us on

    Foods For Brain: తీసుకుంటున్న ఆహారం, మారుతున్న జీవన శైలి వల్ల చాలామంది మెమరీ లాస్, బ్రెయిన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక చాలా మందికి అరె ఇప్పుడే ఒక వస్తువును ఎక్కడో పెట్టాం కదా.. ఏమైంది? అప్పుడే మర్చిపోయామా? అనేవారు ఎక్కువ ఉన్నారు. మీకు కూడా చాలా సార్లు ఇలా జరిగిందా? అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం లేదన్నమాట. బ్రెయిన్‌ సరిగ్గా వర్క్ చేయాలంటే వాటికి కొన్ని పోషకాలను అందివ్వాలి. అలా చేస్తేనే బ్రెయిన్ చురుగ్గా మారుతుంది. మిమ్మల్ని చురుగ్గా థింక్ చేసేలా మారుస్తుంది. అయితే బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలను తీసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మరి అవేంటో కూడా ఓ సారి చూసేయండి.

    పసుపు: దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇది ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకు పరిష్కారంగా పసుపును వాడుతున్నారు. ఇందులో ఉండే కర్కుమిన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా సమస్యలకు చెక్ పెడతాయి. దీనిని మనం డైట్‌లో యాడ్ చేసుకుంటే బ్రెయిన్ ఫంక్షన్స్ మెరుగు అవుతాయి. దీంతో పాటు అల్జీమర్స్ సమస్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయి. అందుకే వీటిని ప్రతి వంటలో కూడా ఉపయోగించాలి అంటారు నిపుణులు.

    గోతు కోలా: ఈ ఆకులు చాలా మందికి తెలియవు. కానీ ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటికి బ్రెయిన్ హెల్త్‌ని కాపాడే గుణాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుందట. దీంతో పాటు బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుందట. గోతుకోలాని తీసుకోవడం వల్ల అల్జీమర్స్ /వంటి ఎన్నో సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

    అశ్వగంధ: అద్భుతమైన మూలిక అశ్వగంధ. దీన్ని వాడటం వల్ల మతిమరుపు వంటి సమస్యలు దూరం అవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బ్రెయిన్ హెల్త్‌ని కాపాడుతుంది. ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయని..దీన్ని తీసుకుంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుందని, బ్రెయిన్ హెల్త్ మెరుగు అవుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

    ఈ మూలికలు అన్నీ కూడా ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి. ఇక పసుపు అయితే ప్రతి వంటింట్లో కామన్ గా లభిస్తుంది. కానీ వీటిని నేరుగా వాడటం కంటే నిపుణులు సలహాలతో మాత్రమే వాడటం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. భయపడాల్సిన అవసరం లేదు. నిపుణుల సలహాతో ఎంత పరిమాణంలో వాడాలో తెలుసుకోవచ్చు. వయసు, వ్యక్తిని బట్టి దీని పరిమాణం మారుతుంటుంది కాబట్టి జాగ్రత్త.

    మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..వీటితో పాటు కొన్ని వ్యాయామాల ద్వారా కూడా మీ బ్రెయిన్ హెల్త్ ను కాపాడుకోవచ్చు. ఎక్కువ స్ట్రెస్ కు గురి కావద్దు. ఎంత శాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటే మీ బ్రెయిన్ అంత షార్ప్ గా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్.