BP Control: బీపి పెరిగితే స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రావద్దు అంటే ముందుగా చేయాల్సిన పని బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి. బీపి పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా లైఫ్‌స్టైల్ చేంజ్ చేయడం, సరైన డైట్ లేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటన్నింటిని కంట్రోల్ చేస్తూ కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల మీ బీపీ తగ్గుతుంది. అయితే ఒకసారి మీ బీపీ కంట్రోల్ అవడానికి ఎలాంటివి పాటించాలో చూసేయండి.
బరువులు ఎత్తితే మీ బీపీ కచ్చితంగా కంట్రోల్ అవుతుంది. వాస్తవానికి బరువు ఎత్తిత్తే బీపి పెరుగుతుంది. కానీ ఇలా చేస్తే ఫిట్ గా ఉంటారు. సో బీపీ లెవల్స్ మెరుగు అవుతుంటాయి. కానీ ఈ బరువులను ఎత్తేవిషయంలో ట్రైనర్స్ పర్యవేక్షణలోనే జరగాలి అంటున్నారు నిపుణులు. మరో విధంగా అంటే ట్రెడ్‌మిల్, పెడల్ పుషింగ్ కూడా చేయవచ్చు. జిమ్‌కి వెళ్ళేవారు వీటిని ఫాలో అవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. బీపీ నుంచి మాత్రమే కాదు మరిన్ని సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.. జిమ్ కు వెళ్లకపోతే ఇంట్లో కూడా బరువులు ఎత్తవచ్చు. దీని వల్ల బీపి కంట్రోల్ అవుతుంది.
ఎత్తైన ప్రదేశాలు, కొండ ప్రాంతాలను ఎక్కడం వల్ల ఏదో తెలియని ఎక్జైట్ మెంట్ ఉంటుంది. హైకింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బీపి 10 పాయింట్స్ తగ్గుతుంది అంటున్నారు నిపునులు. అందుకే కాస్త ఎత్తైన ప్రదేశాలు ఎక్కడం, కొత్తవి తెలుసుకోవడం వంటి ఉత్తేజమైన పనులు చేస్తుండాలి. అప్పుడు మైండ్ యాక్టివేట్ లో ఉంటుంది.
సైక్లింగ్ కూడా బీపిని కంట్రోల్ చేస్తుంది. రోజులో ఓ 30 నిమిషాలు సైక్లింగ్ చేయడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. అందులో ఒకటి బీపి కంట్రోల్ అవుతుంది.ఈ సైక్లింగ్ వల్ల బీపీ తక్కువ అవుతుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా దీన్ని ప్రతి రోజు పాటించండి.
నడక వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. మార్నింగ్ వాక్ వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీని వల్ల చాలా లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా రక్తనాళాలు మెరుగ్గా పనిచేస్తాయి. దీంతో రక్తప్రవాహం బెటర్ గా జరుగుతుంది. హైబీపిని కంట్రోల్ చేయడంలో మీకు వాకింగ్ చాలా సహాయం చేస్తుంది అంటున్నారు నిపుణులు. అందుకే ప్రతి రోజు ఒక అరగంట సేపు వాకింగ్ చేస్తే సరిపోతుంది. లేదంటే రోజులో 3 సార్లు 10 నిమిషాల చొప్పున నడిచినా సరే మంచి ఫలితాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా బీపిని కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా 60, ఆ పై వయసున్న వారిలో స్విమ్మింగ్ వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చని, బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వారంలో 150 నిమిషాలు నెమ్మదిగా స్విమ్ చేయాలి. లేదంటే లేదంటే 75 నిమిషాల పాటు స్పీడ్‌గా స్విమ్ చేయవచ్చు. ఇలా చేస్తే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.