Reproductive System: అదేపనిగా ధూమ, మద్య పానం చేస్తే ఏమవుతుంది. దంతాలు ఊడిపోతాయి. చిగుళ్ళలో రక్తస్రావం జరుగుతుంది. అంతేకాదు గుండె, కాలేయం, మూత్రపిండాలు ప్రభావితమవుతాయి. చివరికి మరణం సంభవిస్తుంది. అయితే ఇవి మాత్రమే కాదట.. మద్యపానం, ధూమపానం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయో.. తెలుసుకునేందుకు ఏయిమ్స్ వైద్యులు ఒక అధ్యయనం చేశారు. ఇందులో పలు విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
వాటికి అలవాటు పడుతున్నారు
మద్యపానం, ధూమపానం చేసేవారు ప్రాసెస్డ్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. మద్యం తాగిన సమయంలో ఆ ఫుడ్ తినేందుకు ఇష్టపడుతున్నారు. ధూమపాన సమయంలోనూ ప్రాసెస్డ్ ఫుడ్ ఇష్టానుసారంగా తింటున్నారు. అది శుక్రకణాల నాణ్యతను దెబ్బ తీస్తోంది. వంధ్యత్వం, గర్భస్రావం, పిల్లలు పుట్టుక లోపాలు వంటివి శుక్రకణాల్లో డీఎన్ఏ దెబ్బ తినడం వల్ల సంభవిస్తాయని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు..
శుక్రకణం నాణ్యత..
ఒక స్త్రీ ఒక పురుషుడు వల్లే గర్భధారణకు గురవుతుంది. ఇలాంటి సమయంలో వీర్యంలో ఉన్న డీఎన్ఏ నాణ్యత ఆధారంగానే పిండం అభివృద్ధి జరుగుతుంది. అలాంటి సమయంలో గర్భానికి కారణమైన తండ్రి పాత్ర విస్మరించలేనిది. అలాంటప్పుడు ఆ తండ్రి వీర్యం నుంచి వచ్చే శుక్రకణం ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా దానిపై ఉన్న డీఎన్ఏ చైతన్య శీలంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, అనారోగ్య కరమైన జీవనశైలి వంటివి శుక్రకణాల నాణ్యత ప్రభావితం చేస్తాయి.
ఇవి చేయాలి
శుక్రకణం నాణ్యత బాగుండాలంటే మద్యపానం చేయకూడదు. దూమపానం జోలికి పోకూడదు. అన్నింటికీ మించి రోజూ వ్యాయామం చేయాలి. యోగ సాధన చేయాలి. అప్పుడే మైటోకాండ్రియల్, న్యూక్లియర్ డీఎన్ఎల సమగ్రత పెరుగుతుంది. శుక్రకణంలో నాణ్యత మెరుగవుతుంది. అప్పుడు పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పిండం అభివృద్ధి సక్రమంగా ఉంటుంది. పిండం వృద్ధి చెందుతున్న దశలలో అవయవాల క్రమం కూడా సక్రమంగా ఉంటుందని ఎయిమ్స్ వైద్యుల అధ్యయనంలో తేలింది.