Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. నేడు శ్రీరామనవమి పండగను పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. హరి హర వీరమల్లు లేటెస్ట్ పోస్టర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. పదునైన ఖడ్గం వెనుక నుండి చురకత్తిలాంటి పవన్ కళ్యాణ్ కళ్ళతో కూడిన పోస్టర్ అంచనాలు పెంచేసింది. కత్తికి మించిన వాడి పవన్ కళ్యాణ్ కళ్ళలో కనిపిస్తుంది.
ఇక పోస్టర్ పై ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో మీ ముందుకు అని పోస్టర్ పై ఒక అద్భుతమైన కొటేషన్ జోడించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ ట్రీట్ అదిరింది. హరి హర వీరమల్లు కథ విషయానికి వస్తే.. మొగలుల కాలం నాటి బందిపోటుగా పవన్ కళ్యాణ్ పాత్ర ఉండనుంది. పెద్దలను దోచి పేదలకు పెట్టే హరి హర వీరమల్లుగా ఆయన కనిపిస్తారు.
ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ పోస్టర్ మరింతగా ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో హరి హర వీరమల్లు ఆలస్యం అవుతుంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా వచ్చే ఏడాది తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేస్తారు.
హరి హర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. నోరా ఫతేహి మరో హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అధికారిక ప్రకటన రాలేదు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నాడు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక హరి హర వీరుమల్లుతో పాటు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, ఓజీ చిత్రాల్లో నటిస్తున్నారు.