Premature Aging: కాలం మారుతున్న కొద్దీ వయసు పెరిగిపోతుంది. ఇప్పుడున్న వయసు మారిపోయిన తర్వాత తిరిగి రమ్మంటే రాదు. అందుకే ప్రపంచంలో అత్యంత విలువైనది కాలం అని అంటుంటారు. అయితే వయసులో అత్యంత ప్రధానమైనది యవ్వనం, మద్యస్థం. ఈ వయసులోనే చేయాల్సిన పనులన్నీ చేయాలి. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలు ఉండడంతో కొన్ని పనులు చేయడానికి శరీరం సహకరించదు. అయితే నేటి కాలంలో చిన్న వయసులోనే చాలామంది వృద్ధులుగా మారిపోతున్నారు. యవ్వనం, మధ్యస్థ వయసులో ఉన్నవారే కొన్ని పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇలా మీరు చిన్న వయసులోనే ముసలి వాళ్లుగా మారిపోవడానికి వైద్యులు చెబుతున్న ప్రకారం ఐదు కారణాలు కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
నీరు తాగకపోవడం:
ఉద్యోగం, వ్యాపారం కారణంగా చాలామంది బిజీ వాతావరణం లో గడుపుతున్నారు. దీంతో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. కొందరు వైద్య పరిశోధకులు చెబుతున్న విషయం ఏంటంటే.. శరీరానికి కావాల్సిన నీటిని తీసుకోవడానికి కూడా శ్రద్ధ ఉంచడం లేదు. అయితే డాక్టర్ Natalia Dmitrieva చెబుతున్న ప్రకారం మనం ప్రతిరోజు సరైన నీరు తీసుకోకపోవడం వల్ల శరీరంలో సోడియం పెరుగుతుంది. దీంతో శరీరంలోని మృత కణాలు తగ్గిపోయి వయసు పెరిగినట్లు అవుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే ఏజ్ బార్ అయినట్లు కనిపిస్తుంది.
ఒకే చోట కూర్చోవడం:
నేటి కాలంలో చాలామంది ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిపోవడంతో శరీరానికి కావాల్సిన వ్యాయామం ఉండడం లేదు. దీంతో డిఎన్ఏ చివరి క్యాప్ పైన Telomere ఉంటుంది. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇది అరిగిపోతుంది. దీంతో వయసు తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది.
సరైన నిద్ర లేకపోవడం:
ఒత్తిడి, సమస్యల కారణంగా తక్కువగా నిద్రపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మరికొందరు రకరకాల అలవాట్లతో సరైన నిద్రపోవడం లేదు. UCLA పరిశోధన ప్రకారం.. సరైన నిద్ర లేకపోవడం వల్ల.. లేదా ఆలస్యంగా నిద్రపోయిన..సెల్స్ Aging తొందరగా పెరుగుతుంది. దీంతో చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తారు.
మనుషుల మధ్య కమ్యూనికేషన్స్ లోపించడం:
కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో ఎక్కువగా మాట్లాడకపోవడం.. సైలెంట్ గా ఉండడం వల్ల మొహంపై గీతలు.. ముడతలు వచ్చే అవకాశం ఉందని వైద్యుల పరిశోధన ప్రకారం తెలుస్తుంది.
అనవసరపు కామెంట్స్ చేయడం.. ఎక్కువగా వాదించడం:
అవసరపు విషయాలపై కామెంట్స్ చేయడం.. గట్టిగా అరవడం వల్ల కూడా వాళ్ల వయసు తొందరగా పెరిగిపోయే అవకాశం ఉంటుందని మధ్యలో తెలుపుతున్నారు. మిగతా వారి కంటే వీరిలో ఎక్కువగా డిఎన్ఏ దెబ్బతింటుంది. సెల్ఫ్ రికవరీ ఫాస్ట్గా అవుతూ ఏజ్ పెరిగిపోతుంది.
ఈ విధంగా మనం చేసే కొన్ని అలవాట్లతోనే చిన్నవయసులోనే పెద్దవారీగా కనిపిస్తున్నారు. అందువల్ల రోజువారి చేసే పనులతో పాటు ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు తెలుపుతున్నారు.