US Delta force : బాహుబలి 2 సినిమా చూశారా? అందులో ప్రభాస్, సత్యరాజు దేశయాటనకు వెళ్లినప్పుడు పిండారీలు కనిపిస్తారు. వారు మనుషులను అత్యంత దారుణంగా చంపేస్తారని.. వారికి ఏమాత్రం కనికరం ఉండదని.. చూస్తే చాలు సర్వనాశనమని అంటారు.. ఆ ఆ డైలాగు పిండారీలకు ఎలాగైతే వర్తిస్తుందో.. అమెరికాలో ఉన్న డెల్టా ఫోర్స్ అనే సైన్యానికి కూడా అలాగే వర్తిస్తుంది.
వెనిజులా అధ్యక్షుడు మదురో ను అరెస్ట్ చేయడంలో డెల్టా ఫోర్స్ కీలకపాత్ర పోషించింది. డెల్టా ఫోర్స్ ఒక దేశ అధ్యక్షుడిని బంధించడం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ అనేది సు శిక్షితమైన కమాండో వ్యవస్థ. అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లను ఈ కమాండో బృందం నిర్వహిస్తూ ఉంటుంది.
అమెరికా ఎందుకు ఏర్పాటు చేసుకుందంటే
ప్రపంచ వ్యాప్తంగా 1970 కాలం నుంచి ఉగ్రవాదం అనేది జడలు విప్పడం మొదలుపెట్టింది. అయితే ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరమని అమెరికా భావించింది. అమెరికా ఇలా భావించడానికి సైనిక ఉన్నతాధికారి చార్లీ ఆలోచనే కారణం. అప్పట్లో ఆయనకు చార్లీ 22వ బ్రిటిష్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ లో పనిచేసిన అనుభవం ఉంది. అందువల్లే ఆయన 1977లో డెల్టా ఫోర్స్ అనే టమాటో బృందాన్ని ఏర్పాటు చేశారు. డెల్టా ఫోర్స్ అనేది అమెరికా జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కిందికి వస్తుంది. డెల్టా ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఉత్తర కరోలిన ప్రాంతంలోని పోర్టు బ్రాగ్ లో ఉంది.
రక్షణగా దిగుతుంటారు
అమెరికాకు ఎటువంటి ముప్పు వచ్చిన సరే డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగుతుంది. అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లు చేపడుతూ ఉంటుంది. అమెరికాకు శత్రువులుగా ఉండే ఏ వ్యక్తులనైన సరే డెల్టా ఫోర్స్ పట్టుకుంటుంది. అవసరమైతే చంపేస్తుంది. ఉగ్రవాద బృందాలను నాశనం చేయడానికి అమెరికా డెల్టా ఫోర్స్ ను వాడుతూ ఉంటుంది. అమెరికాలోని సీనియర్ నాయకులు ప్రపంచంలో ఎక్కడైనా పర్యటిస్తే డెల్టా ఫోర్స్ కమాండోలు వారికి భద్రత కల్పిస్తారు. డెల్టా ఫోర్స్ లో పనిచేసే కమాండోలు విమానాలు, ఓడలు, రైళ్లు.. బస్సులు.. ఎలాంటి వాటిలోనైనా ప్రయాణించగలుగుతారు.
డెల్టా ఫోర్స్ లో పనిచేసే కమాండోలకు కఠినమైన శిక్షణ అందిస్తారు. వీరిని గ్రీన్ బేరే(ప్రత్యేక దళాలు) అని పిలుస్తుంటారు. అమెరికాలను 75వ రెజిమెంట్ కు చెందినవారిని డెల్టా ఫోర్స్ కోసం ఎంపిక చేస్తారు. డెల్టా ఫోర్స్ కోసం ఎంపిక ప్రక్రియ దాదాపు మూడు నుంచి నాలుగు వారాల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియకు 100 మందిని ఎంపిక చేస్తే అందులో 90 మంది విఫలమవుతూనే ఉంటారు . 16 కిలోల బరువుతో రాత్రిపూట 27 కిలోమీటర్లు పరుగు పెట్టిస్తారు. 20 కిలోల బరువుతో 60 కిలోమీటర్ల దూరం ఎగుడు దిగుడు నేలపై పరుగులు తీస్తుంటారు. ఇందులో భూతీర్ణం సాధించిన వారు ఆపరేటర్స్ ట్రైనింగ్ కోర్స్ లోకి ప్రవేశిస్తారు. ఈ కోర్సు 6 నెలల పాటు సాగుతుంది. ఆ తర్వాత వారు డెల్టా ఫోర్స్ కమాండోగా రూపాంతరం చెందుతుంటారు. డెల్టా ఫోర్స్ లో రెక్కీ/ స్నైపర్ ట్రూప్, డైరెక్ట్ యాక్షన్, అసాల్ట్ గ్రూపు వంటి ర్యాంకులు ఉంటాయి.