Homeఆంధ్రప్రదేశ్‌NDA Meeting: బాాబును నెత్తినపెట్టుకుంటున్నారు.. ఇది కదా ఏపీకి కావాల్సింది

NDA Meeting: బాాబును నెత్తినపెట్టుకుంటున్నారు.. ఇది కదా ఏపీకి కావాల్సింది

NDA Meeting: సగటు తెలుగుదేశం పార్టీ అభిమానికి సంతోషకర సమయం ఇది. రాష్ట్రంలో అంతులేని విజయం, కేంద్రంలో అధినేతకు గౌరవంతో టిడిపి శ్రేణులు ఆనందంతో గడుపుతున్నాయి.గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి, చంద్రబాబు దుస్థితి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకే ఒక గెలుపుతో పరిస్థితి మారిపోయింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 135 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. అదే సమయంలో టిడిపి సాధించిన 16 పార్లమెంటు స్థానాలు.. ఎన్డీఏ కు కీలకంగా మారాయి. సహజంగానే ఇది చంద్రబాబుకు ప్రాధాన్యత పెంచే అంశం. దీంతో ఢిల్లీలో చంద్రబాబుకు గౌరవం అమాంతం పెరిగింది.

గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. గత ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత చంద్రబాబు పరిస్థితి మరింత దిగజారింది. పట్టించుకునే వారే కరువయ్యారు. అందుకే బిజెపి అవసరాన్ని తెలుసుకొని తన వద్ద ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను అటు పంపించారు. కానీ బిజెపి నుంచి ఎటువంటి సానుకూలత రాలేదు. ఎన్నడూ చంద్రబాబును పట్టించుకున్న పాపాన పోలేదు బిజెపి. చివరకు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా లభించని పరిస్థితి. దాదాపు కేంద్ర పెద్దలను దగ్గరగా చూసేందుకు చంద్రబాబుకు మూడేళ్ల సమయం పట్టింది. అదే సమయంలో జగన్కు కేంద్ర పెద్దలు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అసలు చంద్రబాబు అన్న నేత ఒకరు ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయారు. దీంతో సగటు టిడిపి అభిమాని పడిన బాధ అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం ఎన్నికలతో సీన్ మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి అద్భుత విక్టరీ కొట్టడం, ఎన్డీఏకు అవసరమైన సీట్లు చంద్రబాబు సాధించడం ఢిల్లీ పెద్దల్లో మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న చంద్రబాబు, పవన్ లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరు ఢిల్లీలో అడుగు పెట్టింది మొదలు ఎనలేని ప్రాధాన్యం, గౌరవం దక్కుతూ వస్తోంది. ప్రతిక్షణం ఆనందమయం అన్నట్టు.. చంద్రబాబుతో కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్న తీరు చూసి టిడిపి అభిమానులు మురిసిపోతున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ చంద్రబాబును తన పక్కనే కూర్చోబెట్టారు. సరదాగా సంతోషంగా మాట్లాడుకున్నారు. ఎన్డీఏ భాగస్వామి పక్షాల నేతలు చంద్రబాబుతో కలిసేందుకు ఇష్టపడ్డారు. అదే సమయంలో ఇండియా కూటమి సమావేశానికి వచ్చిన విపక్ష సీఎంలు సైతం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలను చూస్తున్న టిడిపి శ్రేణులు మురిసిపోతున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version