https://oktelugu.com/

Heart Attack: ఈ సంకేతాలు ఉంటే గుండెపోటు వస్తుంది.. ముఖ్యంగా చెవిలో ఈ సమస్య వస్తుంది..

గుండెపోటు సంభవించే ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం కూడా కనిపిస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 17, 2024 / 03:21 PM IST

    Heart Attack

    Follow us on

    Heart Attack: ప్రస్తుతం గుండెపోటు సమస్యలు చాలా మందికి పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య వస్తుంది. ఇక గుండెపోటు వల్ల చనిపోయే వారి సంఖ్య కూడా పెరిగింది. పెద్ద వయసు మాత్రమే కాదు చిన్న వయసు కూడా హార్ట్ ఎటాక్ కు బలి అవ్వాల్సిందే అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇతర వ్యాధులలాగా కాకుండా గుండెపోటు సడన్ గా వస్తుంది. కొన్ని లక్షణాలు ముందస్తుగా కనిపిస్తాయి. కానీ కొన్ని సార్లు గుర్తించకపోవచ్చు. అజీర్ణం లేదా గుండెల్లో మంట వంటివి చాలా మందిలో వచ్చే లక్షణాలు. ఇక ఈ హార్ట్ ఎటాక్ తో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సతమతమవుతున్నారు. ఏది ఏమైనా గుండెపోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలానే ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యల నుంచి కాస్త దూరంగా ఉండవచ్చు. అయితే ఈ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి అవేంటో చూసేద్దాం.

    గుండెపోటు సంభవించే ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం కూడా కనిపిస్తుంది. గుండె ప్రాంతంలో ఒత్తిడి, తిమ్మిరి లేదా నొప్పి వంటివి వస్తే ఆలస్యం చేయవద్దు. ఇవి హార్ట్ ఎటాక్ కు ప్రారంభ సంకేతాలు అంటున్నారు నిపుణులు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, గుండెపోటు లక్షణాలు పురుషులు ,స్త్రీల మధ్య కొన్ని తేడాలు ఉంటాయట. పురుషుల మాదిరిగానే స్త్రీలు సాధారణ ఛాతీ నొప్పితో బాధపడుతుంటారు. శ్వాస ఆడకపోవడం, వికారం, వాంతులు, వెన్ను లేదా దవడ నొప్పి వంటివి స్త్రీలలో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు పురుషుల్లో ఉండకపోవచ్చు.

    చెవి పోటు లక్షణాల ద్వారా కూడా గుండెపోటును గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు. దీన్నే ఫ్రాంక్ స్ సైన్’ అంటారు. ఇది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది. గుండె పోటు వచ్చే ముందు చెవిలో ఒక రకమైన సౌండ్ వస్తుంది అంటున్నారు నిపుణులు. మెదడుకు రక్తం సరఫరా చేసే పెద్ద రక్తనాళాలైన కరోటిడ్ ధమనులు మూసుకుపోవడం వల్ల ఈ సౌండ్ వస్తుంది.ఈ దమనులు కుచించుకుపోవడం ధమని గోడల లోపల ఫలకం వల్ల సంభవిస్తుంది. కొన్ని సార్లు కొలెస్ట్రాల్ పేరుకొని పోయినా సరే ఈ సమస్య వస్తుంది. దీని వల్ల స్ట్రోక్ వస్తుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. దవడ, మెడ, డైజెస్టివ్ సిస్టంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కూడా గుండె పోటు లక్షణాలే అంటున్నారు నిపుణులు. 45 సంవత్సరాలు పైబడిన పురుషులు, 55 సంవత్సరాలు పైబడిన మహిళలు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, మధుమేహం , జీవక్రియ లోపాలు వంటి సమస్యలు ఉంటే కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

    మీకు ఛాతిలో నొప్పి అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. చాలామంది ఇది ఎసిడిటీ అనుకొని లైట్ తీసుకుంటారు. అయితే గుండె పోటు వచ్చే ముందు కూడా ఛాతిలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది కాబట్టి దీన్ని గుర్తించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా సరే గుండెపోటుకు సంకేతమే. గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని, వ్యాయామం వంటివి చేస్తుండాలి. అంతేకాదు మరిన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం నుండి బయటపడవచ్చు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.