https://oktelugu.com/

Mental Health: మానసిక ఆనందం పెంచే ఆహారాలు ఇవే..

చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వారు ఉంటారా? చాలా మందికి ఇష్టమే. అందులో డార్క్ చాక్లెట్స్ అంతే మరింత ఇష్టం. వీటిని తింటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గించడంలో డార్క్ చాక్లెట్లు పనిచేస్తాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 25, 2024 / 11:59 AM IST

    Mental Health

    Follow us on

    Mental Health: మానసిక ఆనందం: ఎక్కడ కొంటే దొరుకుతుంది మానసిక ఆనందం, ఎక్కడికి వెళ్తే వస్తుంది అంటూ వెతికే రోజులు వస్తాయి కావచ్చు కదా. ఫుల్ బిజీ, పక్కన అయిన వాళ్లు ఉండరు. ఉన్న వాళ్లు నాశనం కోరుకుంటారు. నక్క జిత్తుల స్నేహాలు. అందుకే మనుషులు, మనస్తత్వాలు, ఆలోచనలు మారాలి అంటున్నారు నిపుణులు. ఆలోచనల గురించి పక్కన పెడితే కొన్ని ఆహారాలు తినడం వల్ల కూడా మానసిక ఆనందం దొరుకుతుందట. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా?

    డార్క్ చాక్లెట్స్: చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వారు ఉంటారా? చాలా మందికి ఇష్టమే. అందులో డార్క్ చాక్లెట్స్ అంతే మరింత ఇష్టం. వీటిని తింటే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గించడంలో డార్క్ చాక్లెట్లు పనిచేస్తాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్స్, కోకో జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. మంచి మూడును కూడా తెస్తాయి ఈ చాక్లెట్లు.

    గుమ్మడి గింజలు, బ్లూబెర్రీ: గుమ్మడి గింజల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెడదు ఆరోగ్యాన్ని రక్తిస్తాయి. మానసికంగా కూడా బలంగా మారుస్తాయి ఈ గుమ్మడి గింజలు. బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇవి నాడీ సంబంధ సమస్యలు రాకుండా చూస్తాయి. అంతేకాదు మెదడు ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంటాయి. మనసును ఉల్లాసంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.

    కొవ్వు చేపలు, బ్రకోలీ: మాకరెల్, సాల్మోన్, సార్డైన్స్ వంటి కొవ్వు ఉండే చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి మూడ్ ను మార్చి ఉల్లాసంగా మారుస్తాయి. బ్రకోలీలో విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడును చురుగ్గా మార్చడంలో సహాయం చేస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.

    పసుపు, నారింజ: పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెదడును చురుగ్గా మార్చుతుంది. మతిమరుపు వంటి సమస్యలను కూడా రాకుండా చూస్తుంది పసుపు. నారింజ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి మంచి మూడ్ ను తెప్పిస్తాయి.

    ఆకుకూరలు, గింజలు: మానసికంగా బలంగా ఉండటం కోసం మీ డైట్ లో ఆకుకూరలు చేర్చడం చాలా అవసరం. వీటిలోని పొటాషియం, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
    జీడిపప్పు, వాల్ నట్స్, హేజిల్ నట్స్ వంటి గింజల్లో కూడా ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ ఉంటాయి.ఈ గింజలు మెదడు పనితీరును మెరుగు చేస్తాయి.. మానసికంగా దృఢంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.