Site icon OkTelugu

Jai Bolo Telangana: ‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Jai Bolo Telangana

Jai Bolo Telangana

Jai Bolo Telangana: తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ తెలంగాన వాసులకు తప్పకుండా గుర్తుండే ఉంటుంది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించిన సంఘటనలు ఈ సినిమాలో కళ్లకు గట్టినట్లు చూపించారు. అయితే ఈ మూవీ కేవలం పోరాటాల నేపథ్యంలోనే కాకుండా లవ్, ఎమోషన్స్ వంటివి చూపించారు. అయితే ఈ సినిమాలో నటించిన మీరా నందన్ సహజ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈమె ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?

తెలంగాణ పోరాటం జరుగుతున్న సమయంలో 2011లో ‘జై బోలో తెలంగాణ’ మూవీ రిలీజ్ అయింది. ఎన్. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని మహాలక్ష్మీ బ్యానర్ పై నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో వచ్చిన ఈ మూవీకి ఐదు నంది అవార్డులు కూడా లభించాయి. 2009లో జరిగిన తెలంగాణ పోరాటానికి సంబంధించిన సన్నివేశాలను ఇందులో చూపించారు. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన మీరా నందన్ సహజ ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారింది.

మీరా నందన్ సహజ కేరళకు చెందిన అమ్మాయి. ఈమె కొచ్చి ప్రాంతంలో 1990 వనంబర్ 26న జన్మించారు. జర్నలిజం స్టడీ చేసిన ఆ మె ఆ తరువాత 2007లో ఐడియా స్టార్ సింగర్ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆమె యాంకర్ గా పనిచేశారు. బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత మీరా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత 2007లో మలయాళంలోని ‘ముల్లా’ అనే సినిమా ద్వారా తొలిసారి వెండితెరపై కనిపించింది.

ఈ సినిమాలో ఆమె ప్రతిభను చూసి డైరెక్టర్ శంకర్ ‘జై బోలో తెలంగాణ’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె సహజంగా నటించి ఆకట్టుకున్నారు. అ తరువాత తమిళం, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. 2023లో ప్రముఖ వ్యాపార వేత్త శ్రీజును పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా మీరా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. లేటేస్టుగా ఆమెకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version