దేశంలో చాలామందిని వేధిస్తున్న సమస్యలతో హైబీపీ ఒకటని చెప్పవచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కొంతమంది 30 ఏళ్ల వయస్సులోనే హైబీపీతో బాధ పడుతున్నారు. ఒక్కసారి హైబీపీ బారిన పడితే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు హైబీపీ వల్ల హృదయ సంబంధిత సమస్యలు సైతం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.
కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తపోటుకు సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. అధిక రక్తపోటుకు చెక్ పెట్టాలంటే ఆహారంలో ఉప్పును వీలైనంత తగ్గించాలి. రోజులో 2.3 గ్రాముల కంటే ఉప్పును తీసుకోకూడదు. ఉప్పు తక్కువగా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో రక్తపోటు ముప్పును కూడా తగ్గించుకోవచ్చు. రక్తపోటుతో బాధ పడేవాళ్లు ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరంలోని సోడియం స్థాయిలను తగ్గించడంలో పొటాషియం తోడ్పడుతుంది. ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. ఆకుకూరలతో పాటు కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే వ్యాయామాన్ని కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. రక్తపోటుతో బాధ పడేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచిది.
వ్యాయామాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోవడం ద్వారా అనేక సమస్యలు దూరమవుతాయి. ధూమపానం, మద్యం సేవించడం అధిక రక్తపోటుకు కారణాలనే సంగతి తెలిసిందే. మద్యం సేవించడం వల్ల 16 శాతం హైబీపీ కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. రక్తపోటుతో బాధ పడేవాళ్లు ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.