Late Breakfast Effects: ఆహారం సరైన క్రమ పద్ధతిలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇష్టం వచ్చినట్లు తింటే బరువు పెరుగుతారు.. ఆ తర్వాత అనేక రకాల అనారోగ్యానికి గురవుతారు. అయితే కొన్ని కారణాల వల్ల బరువు పెరిగినవారు బరువు తగ్గడానికి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినకుండా ఉంటున్నారు. చాలావరకు ఫుడ్ కంట్రోల్ చేస్తే బరువు తగ్గే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి బ్రేక్ ఫాస్ట్ లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సమయపాలనా లేకుండా బ్రేక్ ఫాస్ట్ చేసినా.. ఇబ్బందులే అని చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం అయితే ఆయుష్షు కూడా తగ్గుతుంది.. ఆ వివరాల్లోకి వెళ్తే..
బ్రిటన్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీ ఇటీవల అల్పాహారంపై పరిశోధనలు నిర్వహించింది. 3000 మంది పై నిర్వహించిన ఈ పరిశోధనలో బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా చేసేవారిలో ఆయుష్షు తగ్గుతున్నట్లు గుర్తించారు. మూడు పూటలా సరైన ఆహారం తీసుకున్న వారు.. వీరికంటే 11% ఆయుషు పెంచుకున్నట్లు తేల్చారు. రోజు సరైన సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఎనిమిది నుంచి పది శాతం వరకు ఆయుష్షు తగ్గుతుందని అంటున్నారు.
బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాకుండా మధ్యాహ్నం, రాత్రి తినే ఆహారం ఒక సమయాన్ని నిర్ణయించుకోవాలని.. సమయపాలన లేకుండా తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం ఏర్పడి శరీరంలో ఉండే పోషకాలపై ప్రభావం పడుతుంది. రోజుకు తినే సమయంలో కాకుండా ఆలస్యంగా ఎన్ని రకాల ప్రోటీన్ల ఆహారం తీసుకున్నా.. ఫలితం ఉండదని చెబుతున్నారు. శరీరంలో పోషకాలు తగ్గితే రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అయితే ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించి.. కచ్చితంగా ఆ సమయంలోనే మూడు పూటలా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. చాలామంది ఉదయం టీ తాగి ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉంటారు. అలా చేయకపోతే కడుపులో జీర్ణ సమస్యలు ఏర్పడి.. ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకున్నా.. జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.
అయితే బ్రేక్ ఫాస్ట్ సమయానికి చేసినా.. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఉదయాన్నే ఆయిల్ లేదా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో ఆ తర్వాత మధ్యాహ్నం ఆహారంపై ప్రభావం చూపుతుంది. ఉదయం లైట్ ఫుడ్ తీసుకోకపోతే.. మధ్యాహ్నం ఆకలి వేయదు. ఫలితంగా సమయానికి ఆహారం తీసుకోవడం జరగదు. దీంతో ఆ తర్వాత అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల సమయానికి ఆహారం తీసుకోవడమే కాకుండా.. త్వరగా జీర్ణమయ్యే పదార్థాలను ఆరగించడం మంచిది.
ఇక ఉదయం తీసుకుని ఆహారంలో ప్రోటీన్లు ఉండే వాటిని తీసుకోవడం మంచిది. ఉదయమే ప్రోటీన్లు తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా మధ్యాహ్నం, రాత్రి చేసే భోజనం కూడా జీర్ణమయ్యేలా చేస్తుంది.