Summer Food Care : వేసవిలో ఆహారం కలుషితం కాకుండా ఉండాలంటే ఇలా చేయండి  

కలుషిత ఆహారం తీసుకుంటే అందులోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్, రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Written By: Srinivas, Updated On : May 23, 2023 4:06 pm
Follow us on

Summer Food Care : వేసవి కాలంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో తగు చర్యలు తీసుకోవాలి. ఎండాకాలంలో ఆహారం కలుషితంగా మారే అవకాశాలు ఎక్కువ. బ్యాక్టీరియా అంటుకునే సందర్భాలు అనేకం. అందుకే వేడి కాలంలో మనం ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ నేపథ్యంలో కలుషిత ఆహారం తీసుకుంటే అందులోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్, రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కలుషిత ఆహారంతో..

కలుషిత ఆహారం తింటే వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం రావడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది. దీని వల్ల ఆహారం కలుషితంగా మారి మనకు ఇబ్బందులు తెస్తుంది. అందుకే ఆహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ముడి పదార్థాలను..

ఆహారం కలుషితంగా మారకుండా ఉండాలంటే పదార్థాలను విడిగా ఉంచాలి. కలపకూడదు. ఇప్పుడు మాంసం, కూరగాయలు తీసుకొస్తే రెండింటని కలపకూడదు. విడివిడిగానే ఉంచాలి. లేదంటే కలుషితంగా మారతాయి. వాటిని శుభ్రంగా కడిగి వేరుగా ఉంచుకోవాలి. రెండింటిని కలిపితే పాత్రలు, వస్తువులు సరిగా శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అంతేసంగతి.

బాగా ఉడికించాలి

ఏ పదార్థమైనా బాగా ఉడికించాలి. ఉడికి ఉడకనివి తింటే విషంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మనం తినే ఆహారాలను బాగా ఉడికించుకోవడం ఉత్తమం. వండిన ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లగా అయినాక తింటే కూడా కలుషితం కావచ్చు. ఇలా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వ్యాధులు మన దరి చేరి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.

వంగ గది శుభ్రంగా..

వంట గదిని ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి. వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. శుభ్రంగా ఉంచుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. దీంతో ఆహారాలు కూడా చెడిపోకుండా ఉంటాయి. అంతేకాని దుమ్ము ధూళితో చిందరవందరగా ఉంటే రోగాలు రావడం ఖాయం. దీన్ని గుర్తించుకుని వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.