ప్రజలకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు..?

సాధారణంగా ఏ వ్యాధికైనా ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. అయితే ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన వారిలో మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కో తరహా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించి ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా తాజాగా శాస్త్రవేత్తలు మరికొన్ని కొత్త లక్షణాలను గుర్తించారు. జలుబు, దగ్గు, జ్వరమే కాదు ఈ లక్షణాలు కనిపించినా కరోనానే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Also Read: చైనాలో విజృంభిస్తోన్న కరోనా.. ఎయిర్ పోర్ట్ […]

Written By: Navya, Updated On : November 25, 2020 12:23 pm
Follow us on


సాధారణంగా ఏ వ్యాధికైనా ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. అయితే ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన వారిలో మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కో తరహా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించి ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా తాజాగా శాస్త్రవేత్తలు మరికొన్ని కొత్త లక్షణాలను గుర్తించారు. జలుబు, దగ్గు, జ్వరమే కాదు ఈ లక్షణాలు కనిపించినా కరోనానే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: చైనాలో విజృంభిస్తోన్న కరోనా.. ఎయిర్ పోర్ట్ మూసివేత ..?

కరోనా ప్రధాన లక్షణాలతో మరికొన్ని భిన్నమైన లక్షణాలను సైతం కరోనా రోగుల్లో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఎవరైతే కరోనా వైరస్ బారిన పడతారో వారిలో జీర్ణ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని.. కరోనా సోకిన వాళ్లలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు సైతం ఉంటాయని ఈ లక్షణాలు కనిపించినా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: కరోనా థర్డ్ వేవ్ భీకరంగా ఉంటుందా..

కరోనా సోకిన వారిలో కంటి సంబంధిత సమస్యలు కూడా ఉంటాయని కళ్లు పదేపదే దురద పెట్టినా, కనుగుడ్దులోని తెల్లని ప్రదేశం ఎర్రబారినా, కండ్ల కలక వచ్చినా కరోనా అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇవి కాక కరోనా వైరస్ సోకిన వారిలో కొన్ని మానసిక సమస్యలు కూడా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. ఆలోచనల్లో స్పష్టత లోపించడం, గందరగోళానికి గురికావడం, అయోమయానికి లోనవడం కూడా కరోనా లక్షణాలే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం:ఆరోగ్యం/జీవనం

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోకుండా కాపాడుకోవచ్చు. మాస్క్ లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.