https://oktelugu.com/

బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పొడవదా?

మరికొద్ది రోజుల్లో తిరుపతి ఉప ఎన్నికకు తెరలేవనుంది. ఈ సీటుపై అటు బీజేపీ.. ఇటు జనసేన పార్టీలు కన్నేశాయి. మంచి ఓటు బ్యాంకు ఉన్న తిరుపతి సీటులో తమ అభ్యర్థికి మద్దతు తెలపాలంటూ జనసేన బీజేపీని పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఈ తిరుపతి సీటు విషయమై ఇరు పార్టీల మధ్య విచ్ఛిన్నానికి దారితీస్తుందా అనేది కూడా డౌట్‌గా ఉంది. బీజేపీ నేత జీవీఎల్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. Also Read: గ్రేటర్ ప్రచారంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 12:10 pm
    Follow us on

    GVL Pawan Kalyan

    మరికొద్ది రోజుల్లో తిరుపతి ఉప ఎన్నికకు తెరలేవనుంది. ఈ సీటుపై అటు బీజేపీ.. ఇటు జనసేన పార్టీలు కన్నేశాయి. మంచి ఓటు బ్యాంకు ఉన్న తిరుపతి సీటులో తమ అభ్యర్థికి మద్దతు తెలపాలంటూ జనసేన బీజేపీని పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఈ తిరుపతి సీటు విషయమై ఇరు పార్టీల మధ్య విచ్ఛిన్నానికి దారితీస్తుందా అనేది కూడా డౌట్‌గా ఉంది. బీజేపీ నేత జీవీఎల్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

    Also Read: గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవం

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని తమ కార్యకర్తలు కోరుకుంటున్నారని.. వారి కోరిక మేరకు 18 మందిని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీలో నిలబెడుతున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకుడు లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి, జనసేన బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించేలా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కు బీజేపీ అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. పవన్ ఢిల్లీ పర్యటన ఎజెండా ఏమిటన్నది ఎక్కడా చెప్పకపోయినప్పటికీ, మీడియా వర్గాలు మాత్రం ఎవరికి తోచిన ఊహాగానాలు వారు అల్లుతున్నారు.

    అమరావతి కోసం వెళ్లాడని ఒక టీవీ చానల్ లో ప్రసారం చేస్తే.. తిరుపతి ఎంపీ టికెట్ కోసం వెళ్లాడని ఇంకొక చానల్‌లో స్టోరీ వేసింది. మరొక చానల్ మాత్రం రిటర్న్ గిఫ్ట్ కోసం పవన్ ఢిల్లీ వెళ్లాడని బ్యానర్ పెట్టింది. ఇదిలా ఉండగా.. తిరుపతిలో గత ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. జనసేన కూటమి అభ్యర్థిగా నిలబడ్డ బీఎస్పీ అభ్యర్థి ప్రచారం చేయకున్నా బీజేపీకి మించి ఓట్లు సాధించాడు. అంతకుమించి గతంలో తిరుపతిలో చిరంజీవి గెలిచి ఉండటం, ఒక సామాజిక వర్గం తిరుపతి ప్రాంతంలో బలంగా ఉండడం వంటి వేర్వేరు కారణాల వల్ల జనసైనికులు కూడా తిరుపతిలో తమ పార్టీ పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

    అయితే.. బీజేపీ నేత జీవీఎల్‌ తన సన్నిహితుల దగ్గర చేసిన వ్యాఖ్యాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘జనసేనకు తిరుపతి టికెట్ ఇవ్వం. బీజేపీయే ఇక్కడ నుండి పోటీ చేస్తుంది’ అంటూ జనసేన పార్టీ అభిమానులకు కోపం తెప్పించేలా వ్యాఖ్యలు చేశారట. ఇరు పార్టీల నేతలు ఢిల్లీలో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో కనీసం బీజేపీ అధికార ప్రతినిధి కూడా కాని జీవీఎల్ ఇలా మాట్లాడడంపై అయోమయం నెలకొంది.

    Also Read: సోదరుల దారిలో నడవని పవన్

    అయితే.. జీవీఎల్ నరసింహారావు కూడా వైఎస్సార్సీపీ మనిషేనని గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబ రావు వంటివారు పలుమార్లు ఆరోపించారు. జీవీఎల్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయం వంటి అనేక నిర్ణయాలకు మద్దతు ప్రకటించారు. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో.. జీవీఎల్ తాజాగా జనసైనికుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఈయన కూడా విష్ణువర్ధన్ రెడ్డి తరహాలో అంతర్గతంగా వైసీపీతో కుమ్మక్కయ్యారనే అనుమానాలు చాలా మందిలో కలిగిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ తిరుపతి ఎంపీ టిక్కెట్ కోరాడా లేదా అన్న దానిపై స్పష్టత రాక ముందే జీవీఎల్ జన సైనికులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ జనసేనల మధ్య పొత్తు నచ్చని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నాలలో జీవీఎల్ భాగం అయ్యాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్