https://oktelugu.com/

హైదరాబాద్ పై బీజేపీ దండయాత్ర!

జీహెచ్‌ఎంసీ పోరు ఈసారి ఎంత రసవత్తరంగా నడుస్తుందో అందరికీ తెలిసిందే. ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే టీఆర్‌‌ఎస్‌ పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. గ్రేటర్‌‌పై కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకు టీఆర్‌‌ఎస్‌కు టగ్‌ ఆఫ్‌ వార్‌‌ పోటీనిస్తోంది. Also Read: బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పొడవదా? అంతేకాదు.. ఇప్పటికే బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిని రంగంలోకి దింపిన బీజేపీ.. కేంద్ర మంత్రులను కూడా తీసుకొచ్చి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 / 08:16 AM IST
    Follow us on

    జీహెచ్‌ఎంసీ పోరు ఈసారి ఎంత రసవత్తరంగా నడుస్తుందో అందరికీ తెలిసిందే. ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే టీఆర్‌‌ఎస్‌ పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. గ్రేటర్‌‌పై కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకు టీఆర్‌‌ఎస్‌కు టగ్‌ ఆఫ్‌ వార్‌‌ పోటీనిస్తోంది.

    Also Read: బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పొడవదా?

    అంతేకాదు.. ఇప్పటికే బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిని రంగంలోకి దింపిన బీజేపీ.. కేంద్ర మంత్రులను కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించాలని ప్లాన్‌ చేస్తోందట. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేత భూపేంద్ర యాద‌వ్ హైద‌రాబాద్‌లో మ‌కాం వేశారు. ఇక ప‌క్కనున్న క‌ర్ణాట‌క నుంచి వీర హిందుత్వ వాద ఎంపీ తేజ‌స్వి సూర్యను రంగంలోకి దించారు. వీరే కాదు మున్ముందు ఇంకా ఎంతో మంది రాబోతున్నార‌ట‌. వారంతా గాక‌.. స్వయంగా అమిత్ షా కూడా వ‌చ్చి ప్రచారం చేయ‌బోతున్నార‌ని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

    గ్రేటర్‌‌ ఎన్నికలైనప్పటికీ రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలాగే అదీ ఒక కార్పొరేషనే. ఒక కార్పొరేష‌న్ ఎన్నిక‌కు స్వయంగా బీజేపీ సుప్రీం లీడ‌ర్లంతా రంగంలోకి దిగుతుండడం ఒకింత ఆశ్యర్యకరంగా మారింది. నిజంగానే అమిత్ షా కూడా ప్రచారానికి వ‌స్తే.. బీజేపీ ఈ ఎన్నిక‌ల‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకున్నట్టే. కేవలం ఒక్క కార్పొరేషన్‌ ఎన్నికలనే ఇంత సీరియస్‌గా తీసుకున్న బీజేపీ.. మరి మున్ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా ఉంది.

    Also Read: గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవం

    అయితే.. స్థానిక నేతలకు బలం లేకపోవడంతోనే జాతీయ స్థాయి నాయకులు రంగంలోకి దిగుతున్నారా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ.. లోకల్‌ లీడర్లు మాత్రం తామూ బలంగానే ఉన్నామని చెప్పుకుంటున్నారు. అలాంట‌ప్పుడు మ‌ళ్లీ జాతీయ నేత‌లు వ‌చ్చి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల కోసం హైద‌రాబాద్ లో మ‌కాం పెట్టాల్సిన అవ‌స‌రం ఉందా..? అని కొంత‌మంది ప్రశ్నిస్తున్నారు. భూపేంద్ర యాద‌వ్ దిగిన‌ప్పుడే ఆ ప్రశ్నలు వెల్లువెత్తాయి. మరి ఇంత చాలెంజ్‌గా తీసుకొని.. మహామహులు ప్రచారంలో పాల్గొని.. చివరికి గ్రేటర్‌‌ పీఠం కైవసం కాని పక్షంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్