https://oktelugu.com/

ఈ ఆహారాలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..!

వైద్యులు ఉదయాన్నే ఎంత బిజీ వర్క్ ఉన్నా బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే తాత్కాలికంగా ఎటువంటి సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో అనారోగ్యంతో బాధ పడే అవకాశాలు ఉంటాయని తెలుపుతున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మంచిదే అయినా కొన్ని ఆహార పదార్థాలను మాత్రం బ్రేక్ ఫాస్ట్ గా అస్సలు తీసుకోకూడదు. ఎవరైతే మంచి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారో వాళ్లే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలరు. కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 8, 2020 / 09:23 AM IST
    Follow us on


    వైద్యులు ఉదయాన్నే ఎంత బిజీ వర్క్ ఉన్నా బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే తాత్కాలికంగా ఎటువంటి సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో అనారోగ్యంతో బాధ పడే అవకాశాలు ఉంటాయని తెలుపుతున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మంచిదే అయినా కొన్ని ఆహార పదార్థాలను మాత్రం బ్రేక్ ఫాస్ట్ గా అస్సలు తీసుకోకూడదు.

    ఎవరైతే మంచి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారో వాళ్లే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలరు. కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పచ్చి కూరగాయలను తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో ఫైబర్లు ఉండే పచ్చి కూరగాయలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఇబ్బందులు పడక తప్పదు. ఉదయాన్నే పచ్చి కూరగాయలు తీసుకునే వాళ్లు గ్యాస్, కడుపు ఉబ్బరం, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

    చాలామంది ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగుతూ ఉంటారు. అయితే ఉదయం వేళ కాఫీ తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఉదయం కాఫీ తాగే వాళ్లలో యాసిడ్ ద్రవాలు ఉత్పత్తి కావడంతో పాటు పొట్టలో పుండ్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఉదయం సమయంలో టమాటాలు, ఆరెంజ్ కూడా తీసుకోకూడదు. ఉదయాన్నే ఇవి తీసుకున్న వాళ్లలో గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు, చికాకు కనిపిస్తాయి.

    మరి కొందరు ఉదయాన్నే కూల్ డ్రింక్ లతో రోజువారీ జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఉదయాన్నే అరటిపండ్లు తీసుకోవడం కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే అరటిపండ్లు తీసుకోవడం మంచిది.