https://oktelugu.com/

జగనన్న విద్యాదీవెన మార్గదర్శకాలు విడుదల.. ఫీజులపై కీలక నిర్ణయం..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న కాలేజీలకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. విద్యార్థులు కాలేజీలలో జాయిన్ అయ్యే సమయంలో అడ్మిషన్ల పేరుతో ఫీజుల కొరకు వేధించవద్దని కోరింది. కాలేజీ ప్రారంభంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో చివరి వరకు అవే కొనసాగించాలని తెలిపింది. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 8, 2020 / 09:38 AM IST
    Follow us on


    ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న కాలేజీలకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. విద్యార్థులు కాలేజీలలో జాయిన్ అయ్యే సమయంలో అడ్మిషన్ల పేరుతో ఫీజుల కొరకు వేధించవద్దని కోరింది. కాలేజీ ప్రారంభంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో చివరి వరకు అవే కొనసాగించాలని తెలిపింది.

    జగన్ సర్కార్ ఈ స్కీమ్ కు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నగదును విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేయనుంది. విద్యార్థి తల్లికి ప్రభుత్వం నుంచి నాలుగు త్రైమాసికాల్లో నగదు జమ కానుంది. ప్రభుత్వం విద్యార్థి తల్లి తరచూ కాలేజీని సందర్శించడం వల్ల విద్యా బోధనతో పాటు, కాలేజీలు కల్పిస్తున్న సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లికి తెలిసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

    విద్యార్థి తల్లి ఖాతాలో నగదు జమైన వారం రోజుల్లో కాలేజీలు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీలో ఫీజు చెల్లించని పక్షంలో ప్రభుత్వం తరువాత విడత ఫీజును జమ చేయదు. విద్యార్థి తల్లి కాలేజీలో ఫీజు చెల్లించినా చెల్లించకపోయినా ప్రభుత్వం బాధ్యత వహించదని మార్గదర్శకాల్లో పేర్కొంది. విద్యార్థి తల్లి కాలేజీలో సౌకర్యాలు బాగోలేవని అనిపిస్తే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

    జ్ఞానభూమి పోర్టల్‌లో లేదా స్పందన పోర్టల్ లో విద్యార్థి తల్లి ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంలో సమస్యలు ఉంటే 1902 నంబర్ కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు.