Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం ప్రభాస్ కెరీర్ ని మార్చేసింది..పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు!

పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీస్ ని పూర్తిగా పక్కన పెట్టి యాక్షన్, మాస్ స్టోరీస్ తో సినిమాలు చేస్తున్నాడు. కరుణాకరన్ డార్లింగ్ స్టోరీ చెప్పగానే, కథ చాలా బాగుంది, కానీ నన్ను అభిమానులు ఇక ఇలాంటి సినిమాల్లో చూడలేరు, ఆ స్టేజిని దాటి వచ్చేసాను, ఈ సినిమాని నేను చేయలేను అని చెప్పుకొచ్చాడట. దీంతో ఈ కథ ప్రభాస్ తో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన డైరెక్టర్ కరుణాకరన్ కి వచ్చింది.

Written By: Vicky, Updated On : October 22, 2024 4:17 pm

Pawan Kalyan- Prabhas

Follow us on

Pawan Kalyan :  ఒకప్పుడు ప్రేమ కథ చిత్రాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాడు. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా ఎన్నో అద్భుతమైన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ఆయన నటించాడు. ఈ సినిమాలు ఆయనకి పది సంవత్సరాలు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చినా కూడా చెక్కు చెదరని స్టార్ ఇమేజి ని తెచ్చిపెట్టాయి. అయితే వింటేజ్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రి. అయినప్పటికీ కూడా సినిమాలు చేస్తున్నాడు. కానీ అప్పటి పవన్ కళ్యాణ్ కి ఇప్పటి పవన్ కళ్యాణ్ కి చాలా తేడా ఉంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ హీరోస్ లో ఒకడు కాబట్టి లవ్ స్టోరీస్ లో జనాలు చూసారు. ఇప్పుడు ఆయన ఆ స్టేజిని దాటిపోయాడు. ఇప్పుడు అలాంటి లవ్ స్టోరీస్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతాయి. ఖుషి తర్వాత కూడా పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీస్ చేయడం బాగా తగ్గిస్తూ వచ్చాడు. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ లాంటి ఆల్ టైం క్లాసిక్ హిట్ ని ఇచ్చిన కరుణాకరన్ ‘డార్లింగ్’ మూవీ స్టోరీ తో పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చాడు.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీస్ ని పూర్తిగా పక్కన పెట్టి యాక్షన్, మాస్ స్టోరీస్ తో సినిమాలు చేస్తున్నాడు. కరుణాకరన్ డార్లింగ్ స్టోరీ చెప్పగానే, కథ చాలా బాగుంది, కానీ నన్ను అభిమానులు ఇక ఇలాంటి సినిమాల్లో చూడలేరు, ఆ స్టేజిని దాటి వచ్చేసాను, ఈ సినిమాని నేను చేయలేను అని చెప్పుకొచ్చాడట. దీంతో ఈ కథ ప్రభాస్ తో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన డైరెక్టర్ కరుణాకరన్ కి వచ్చింది.

ప్రభాస్ కి అప్పటికే మాస్ లో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి కటౌట్ కి మాస్ సినిమాలే అభిమానులు ఆశిస్తారు కానీ, ఇలాంటి లవ్ స్టోరీ తో ప్రభాస్ సినిమా అంటే పెద్ద ప్రయోగమే. అయితే ప్రభాస్ యూత్, లేడీస్ దగ్గరయ్యే కథల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కరుణాకరన్ ఈ స్టోరీ చెప్పగానే ప్రభాస్ కి తెగ నచ్చేసింది. ఇలాంటి కథల కోసమే ఎదురు చూస్తున్నాను, వెంటనే చేసేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా రావడం, అది పెద్ద హిట్ గా నిలవడమే కాకుండా, ప్రభాస్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోవడం జరిగింది. ఇప్పటికీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వేరు, అభిమానులు ఈ చిత్రం రీ రిలీజ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ని తీసుకొచ్చిన ఈ సినిమాకి ముందు ప్రభాస్ కి వరుస ఫ్లాప్స్ ఉండేవి. ఆ ఫ్లాప్స్ నుండి ఈ చిత్రం విముక్తి కలిగించింది.