Honey: తేనె పలుకులు’ అనే పదం చాలాసార్లు వినే ఉంటాం. తేనె పలుకులు అంటే తేనెటీగలు మాట్లాడడం కాదు.. తేనె లాంటి మాటలు అని అనుకోవాలి. అంటే ఆ మాటలు ఎంతో తీయనైనవి అని అర్థం చేసుకోవాలి. అయితే ప్రకృతి సహజసిద్ధంగా లభించే ఈ తీపి పదార్థం తయారు కావడానికి ఎన్నో తేనెటీగల కష్టం ఉంటుంది. అవి ఎంతో కష్టపడి తయారుచేసిన తేనెను మనుషులు తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఒక్కో తేనెటీగా కేవలం7 లేదా 8 చుక్కల తేనెను మాత్రమే తయారు చేస్తుంది. మరి మనుషులకు కావాల్సినంత తేనే ఎలా తయారవుతుంది? ఎన్ని తేనెటీగలు కలిస్తే తేనే పట్టు తయారవుతుంది?
తేనె అనేది పూల లోని మకరందం. ఇది తేనెటీగ శరీరంలోని ఎంజైముల కలయిక ద్వారా తయారయ్యే ఒక సంక్లిష్ట ప్రక్రియ. శ్రామికులు అనే తేనెటీగలు పూలలోని మకరందాన్ని పీల్చుకొని తమ శరీరంలోని తేనె సంచిలో నిలువ చేసుకుంటాయి. ఆ తర్వాత తేనె పట్టు దగ్గరకు వచ్చి నోటి ద్వారా తేనెను అందులో ఉంచుతాయి. తేనె పట్టులో కొన్ని గదులు ఉంటాయి. ఈ గదుల్లో చాలావరకు తేనెను తేనెటీగలు నింపి తమ రెక్కలను ఆడిస్తూ ఉంటాయి. ఇలా ఆడించడం వల్ల తేమలోని నీటి శాతం ఆవిరి అయిపోతుంది. ఈ ప్రక్రియలో 18 శాతం నీరు తగ్గిపోతుంది. తేమ వెళ్లిపోయిన తర్వాత ప్యూర్ తేనె తయారవుతుంది. ఈ తేనే పడవకుండా తేనెటీగలు పలుచటి పొరతో మూసివేస్తాయి.
తేనె పట్టులో ప్రధానంగా మూడు రకాల ఈగలు ఉంటాయి. వీటిలో రాణి ఈగ, శ్రామిక ఈగలు, పోతూ ఈగలు అని అంటారు. రాణిగా ఒక తేనె పట్టులో ఒకటే ఉంటుంది. ఇది రోజుకు 2000 వరకు గుడ్లు పెట్టి తేనెటీగల సమూహాన్ని పిలుస్తుంది. ఈ రాణిగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జీవిస్తుంది. శ్రామిక ఈగలు పూలలోని మకరందాన్ని తీసుకువచ్చి తేనె పట్టులో ఉంచుతాయి. ఇవి కేవలం ఆరు వారాలు మాత్రమే బతుకుతాయి. ఇక పోదు ఈగలు అంటే మగ ఈగలు. ఇవి కేవలం రాణి ఈగతో పరాగ సంపర్కం మాత్రమే చేస్తాయి. ఇతర పనులు చేయవు.
తేనెటీగలు తేనెను మాత్రమే తయారు చేయడం కాకుండా 80 శాతం వరకు పంటలలో ఫలదీకరణం చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే వీటిని వ్యవసాయ స్నేహితులు అని పిలుస్తారు. ఒక తేనెటీగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పైకి ఎగురుతుంది. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ చెడిపోకుండా ఉంటుంది. ఇందులో ఫేమస్ శాతం తక్కువగా ఉండడంతో సంవత్సరాల తరబడి చెడిపోకుండా ఉంటుంది.