UPI Payments: ప్రస్తుత కాలంలో మనీ ట్రాన్స్ ఫర్ కోసం Unified Payment Interface(UPI)ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. కూరగాయల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ చేసేవారు సైతం మొబైల్ లో ఉన్న మనీ ట్రాన్స్ ఫర్ యాప్ ద్వారా యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే నేషనల్ పేమేంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యూపీఐ లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇందులో ఇప్పిటికే చాలా కొత్త ఫీచర్లను అమర్చారు. అయితే మొన్నటి వరకు విదేశాలకు వెళ్లేవారు యూపీఐ ని వాడుకోవడం ఎలా? అనే సందేహం ఉండేది. ఎందుకంటే కొన్ని దేశాల్లో యూపీఐ ట్రాన్జాక్షన్ ను ఒప్పుకునేవారు కాదు. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు ఈ పేమెంట్ ను అనుమతిస్తున్నారు. అదెలాగంటే?
ప్రస్తుతం రష్యా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్, నేపాల్, బూటాన్, ఫ్రాన్స్ అనే దేశాల్లో యూపీఐ పనిచేస్తుంది. భారత్ లో లాగే ఇక్కడ కూడా మొబైల్ నుంచి మానీ ట్రాన్స్ ఫర్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న పనిచేయాలి. ఫోన్ పే ద్వారా యూపీఐ చెల్లింపులు చేయాలని అనుకుంటే ముందుగా చిన్న పని చేయాలి. ఫోన్ పే యాప్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ప్రొఫైల్ పై గట్టి ప్రెస్ చేయడం వల్ల ఒక పేజీ ఓపెన్ అవుంది. ఇక్కడ ‘ఇంటర్నేషనల్’ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అప్పడు బ్యాంకు అకౌంట్లను చూపిస్తుంది. ఏ బ్యాంకు ద్వారా అయితే చెల్లింపులు చేస్తారో.. ఆ బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో ఆ బ్యాంకు ద్వారా పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది నేటి కాలంలో యూపీఐకి అలవాటు అయిపోయారు. ప్రతి చిన్న పేమేంట్ తో సహా మొబైల్ ద్వారా చేస్తున్నారు. కొన్నిసార్లు చిల్లర లేకపోవడంతో యూపీఐని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు విదేశాల్లోనూ యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం వచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకునవారు.. అక్కడే ఉన్న ఇండియన్స్ యూపీఐ ద్వారా పేమేంట్ చేసుకోవచ్చు.
ఫోన్ పే తో పాటు గూగుల్ పేలోనూ ఇదే ఆప్షన్ కలిగి ఉంటుంది. అందువల్ల మొబైల్ లో ఈ రెండు మనీ యాప్ ల ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే ఈ చెల్లింపుల ద్వారా అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ చార్జీల వివరాలు ఆయ బ్యాంకులను బట్టి ఉంటాయి. అందువల్ల ముందే బ్యాంకు నుంచి ఈవివరాలు తెలుసుకున్న తరువాత యూపీఐ పేమేంట్స్ ను ప్రారంభించడం బెటర్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే యూపీఐ పేమెంట్ కంటే ఇతర చెల్లింపులు సులభంగా ఉండి, తక్కువ ఛార్జీలు ఉంటే వాటిని ఫాలో అవడం మంచిదని అంటున్నారు. కానీ ఈజీ పేమెంట్ చేయాలంటే మాత్రం యూపీఐ అనుగువుగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. భారత్ నుంచి ఎక్కువగా దుబాయ్ వెళ్తుంటారు. ఇప్పుడు ఆ దేశం యూపీఐ చెల్లింపులకు అనుమతి ఇచ్చినందున ఈ అవకాశం ఎక్కువగా ఉపయోగపడనుంది.