https://oktelugu.com/

Tea: టీ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

టీ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. ఇలాంటివి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి టీ చేసేటప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: , Updated On : November 16, 2024 / 01:59 AM IST
tea

tea

Follow us on

Tea: ఉదయం లేచిన వెంటనే టీ తాగకపోతే కొందరికి అసలు రోజూ కూడా గడవదు. సాధారణంగా ఎవరికైనా సూర్యోదయంతో డే స్టార్ట్ అయితే.. కొందరికి మాత్రం టీతోనే స్టార్ట్ అవుతుంది. టీ ప్రేమికులు రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో అసలు లెక్క ఉండదు. సమయం సందర్భం లేకుండా టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే ఈ టీలు ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎక్కువగా టీ, కాఫీ తాగడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. అయితే టీ చేసే సమయంలో కొందరు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారు. టీ అనేది లిమిట్‌గా తాగితేనే ఆరోగ్యానికి మంచిది. కానీ అధికంగా తాగడం వల్ల తప్పకుండా సమస్యలను ఎదుర్కొంటారు. అయితే

టీ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. ఇలాంటివి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి టీ చేసేటప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

 

సాధారణంగా టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎక్కువగా ఈ టీని తాగుతుంటారు. అయితే టీని పాలు, చక్కెర, టీ పొడి, అల్లం, నీరు వంటివి వేసి చేస్తుంటారు. అయితే ఇలా అన్ని ఒకసారి కలిపి పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇలా ఒకసారి కలిపి మరిగించడం వల్ల టీ టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదట. ముందుగా పాలు, నీరు మరిగించిన తర్వాత అల్లం వేసి మరిగించాలట. అల్లాన్ని ఎక్కువగా సమయం మరిగించకూడదట. టీ టేస్ట్‌గా రావాలని కొందరు ఎక్కువ సమయం మరిగిస్తారు. ఇలా టీని ఎక్కువ సమయం మరిగిస్తే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి టీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ మిస్టేక్ చేయవద్దు.

 

తలనొప్పి, టెన్షన్‌గా ఉన్న సమయాల్లో టీ బాగా ఉపయోగపడుతుంది. అయితే టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజులో ఒకటి నుంచి రెండు సార్లు టీ తాగవచ్చు. కానీ మరీ ఎక్కువ సార్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా టీ తాగడం వల్ల నిద్ర అనేది సరిగ్గా పట్టదు. నిద్రలేమితో బాధపడుతున్న వారు పూర్తిగా టీ జోలికి వెళ్లకపోవడమే మంచిది. టీలో ఉండే కెఫిన్ అసలు నిద్రపట్టనివ్వదు. దీంతో నిద్రలేమి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. టీకి బదులు గ్రీన్ టీ, బ్లూ టీ వంటివి అలవాటు చేసుకోవడం ఉత్తమం. వీటిని డైలీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలను కూడా దరిచేరనివ్వదు. ఉదయం సమయాల్లో గ్రీన్ టీ తాగితే ఈజీగా బరువు కూడా తగ్గుతారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.