https://oktelugu.com/

North Korea : ఉత్తర కొరియా ఆత్మాహుతి ఆయుధం.. తయారీకి కిమ్‌ ఆదేశాలు..!

ఇప్పటికే పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతోంది. రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ కొనసాగుతోంది. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఉత్తర కొరియా ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 16, 2024 / 01:13 AM IST

    North Korea

    Follow us on

    North Korea : ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు ఆయుధ, ఆర్థికసాయం అందిస్తున్నాయి. దీంతో రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు రష్యావైపు నష్టం జరుగుతోంది. దీనిని గుర్తించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. రష్యాకు సహాయంగా 12 వేల మందిని పంపించారు. దీంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా సైనికులను ప్యాక్‌ చేసి పంపిస్తామని ప్రకటించింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు ఉక్రెయిన్‌ సైనికులు ఉక్రెయిన్‌ల అడుగు పెట్టారు. ఈ తరుణంలో తాజాగా కిమ్‌ చేసిన ఆదేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ మొత్తంలో ఆత్మాహుతి డ్రోన్లు తయారు చేయాలని తమ దేశ అధికారులను ఆదేశించారు. ఓ ఆత్మాహుతి డ్రోన్‌ పరీక్షలో పాల్గొన్న కిమ్‌.. దాని పనితీరు చూసి ముగ్ధుడయ్యారు. భూ ఉపరితలం నుంచి సముద్రంలోని లక్ష్యాలను ఆ డ్రోన్‌ ఛేదించింది. దీంతో మరుసటి రోజే… పెద్ద ఎత్తున సూసైడ్‌ ట్రోన్లు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. తేలికగా ఉపయోగించే శక్తివంతమైన ఆయుధంగా కిమ్‌ ఆత్మాహుతి డ్రోన్లను అభివర్ణించారు.

    తొలిసారి డ్రోన్ల ప్రదర్శన..
    ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర కొరియా తొలిసారి ఆత్మాహుతి డ్రోన్లను ప్రదర్శించింది. రష్యా దోస్తీతో సంపాదించిన టెక్నాలజీతో వాటిని తయారు చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. 2022లో కూడా కిమ్‌ సేనలు చిన్నచిన్న డ్రోన్లను దక్షిణ కొరియా సరిహద్దులో మోహరించింది. నాడు వాటిని కూల్చడానికి సియోల్‌ సేనలు అవస్థలు పడ్డాయి. దీంతో దక్షిణ కొరియా డ్రోన్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ను ఏర్పాటుచేసుకుంది.

    దొంగిలించిన టెక్నాలజీతో..
    ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర కొరియా తొలిసారిగా డ్రోన్లను ప్రదర్శించింది. ఈ డ్రోన్లు ఇజ్రాయెల్‌కు చెందిన హరోప్, హీరో–30, రష్యాకు చెందిన లాన్సెట్‌–3లను పోలి ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లో ఇరాన్‌ హ్యాకింగ్‌కు పాల్పడిన సాంకేతికతను దొంగిలించి మాస్కో చేతికి అప్పజెప్పి ఉంటుందని భావిస్తున్నారు. రష్యా నుంచి టెక్నాలజీని పొంది ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు.