Homeఅంతర్జాతీయంDonald Trump : గొడ్డలి విసిరిన వ్యక్తికి రక్షణ శాఖ కార్యదర్శి పదవి.. ట్రంప్ నిర్ణయం...

Donald Trump : గొడ్డలి విసిరిన వ్యక్తికి రక్షణ శాఖ కార్యదర్శి పదవి.. ట్రంప్ నిర్ణయం అమెరికన్లకు షాక్..

Donald Trump : అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ ఇటీవల మాజీ సైనికుడు, టీవీ నటుడు పీటర్ హెగ్ సేత్ ను రక్షణ శాఖ కార్యదర్శిగా ఎంపిక చేశారు. పీటర్ హెగ్ సేత్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. ఒకప్పుడు పీటర్ హెగ్ సేత్ లైవ్ టీవీ షోలో పాల్గొన్నాడు. ఆ ఛాలెంజ్ లో భాగంగా పీటర్ హెగ్ సేత్ టార్గెట్ వైపు గొడ్డలి విసిరాడు. అది కాస్త టార్గెట్ మిస్ అయి రోడ్డు పక్కన ఉన్న వ్యక్తికి తగిలింది.. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ దర్శనమిస్తోంది. గొడ్డలి దూసుకు రావడంతో ఆ వ్యక్తి గాయపడ్డాడు. అతడికి రక్తస్రావం కూడా తీవ్రంగా జరిగింది. అయితే వెంట్రుక వాసిలో అతడు చావు నుంచి తప్పించుకున్నాడు.. రోడ్డు పక్కన డ్రమ్స్ వాయించుకునే వ్యక్తివైపు పీటర్ హెగ్ సేత్ గొడ్డలి విసిరాడని సామాజిక మాద్యమాలలో అమెరికన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. గొడ్డలి విసిరిన వ్యక్తికి రక్షణ శాఖ కార్యదర్శి పదవి దక్కిందని ఆరోపిస్తున్నారు.. అయితే ఈ వ్యవహారంలో పీటర్ హెగ్ సేత్ పై ఆ డ్రమ్మర్ కోర్టులో దావా వేశాడని తెలుస్తోంది. గ్లోబల్ మీడియాలో మరో కథనం కూడా ప్రసారమవుతోంది.. గొడ్డలి విసరడం వల్ల ఆ డ్రమ్మర్ కు ఎలాంటి గాయాలు కాలేదని.. ఊహాజనితమైన కామెంట్స్ చేయడం నెటిజన్లకు పరిపాటిగా మారిందని ఆ కథనంలో మీడియా చెబుతోంది. అయితే గ్లోబల్ మీడియా ప్రసారం చేసిన ఈ కథనాన్ని వేలాదిమంది నెటిజన్లు ట్విట్టర్లో రీ పోస్ట్ చేస్తున్నారు. రీ ట్వీట్ కూడా చేస్తున్నారు. కొందరైతే గొడ్డలి అలా విసిరిన వ్యక్తికి రక్షణ శాఖలో కీలక పదవి ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. ట్రంప్ నిర్ణయాలు మాకు షాక్ కలిగిస్తున్నాయని మెజారిటీ అమెరికన్లు వాపోతున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమ కష్టాలు మరింతగా పెరుగుతాయని వారు అంటున్నారు.

ట్రంప్ క్యాబినెట్ ఇదే

ఇప్పటివరకు ట్రంప్ తన క్యాబినెట్ ను రెండు విడతలుగా ప్రకటించారు. మస్క్ నుంచి మొదలుపెడితే తులసి గబ్బర్డ్ వరకు అందరికీ పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.. మాట్ గేట్జ్ ను అటార్నీ జనరల్ గా నియమించారు..పీట్ హెగ్ సెట్ ను రక్షణ శాఖ కార్యదర్శిగా, తులసి గబ్బర్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నామినేట్ చేశారు. అయితే వీరికి అనుభవం లేదని.. ట్రంప్ అనవసరంగా వీరిని నియమించారని అమెరికన్ మీడియా కోడై కూస్తున్నా.. ట్రంప్ వెనకడుగు వేయడం లేదు. ట్రంప్ కు అత్యంత వీర విధేయుడైన గుజరాతి వ్యక్తి కాష్ పటేల్ కు కీలక బాధ్యత అప్పగిస్తారని తెలుస్తోంది. సీఐఏ చీఫ్ గా కాష్ పటేల్ కు బాధ్యతలు అప్పగిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే అతడికి బదులుగా జాన్ రాట్ క్లిప్ ను ట్రంప్ సిఐఏ అధిపతి గా నియమించారు. మరోవైపు కాష్ పటేల్ కు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అత్యున్నత పదవి ఇస్తారని తెలుస్తోంది. మొదట్లో సిఐఏ డైరెక్టర్ గా కాష్ పటేల్ ను ట్రంప్ నామినేట్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవి ఊహాజనితం అని తేలిపోయింది..కాష్ పటేల్ తో ట్రంప్ కు మంచి అనుబంధం ఉంది. వారిద్దరూ అనేక ప్రాజెక్టులలో పనిచేశారు. కాష్ పటేల్ కు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి అమెరికాకు వలస వచ్చారు. వారికి గుజరాతి మూలాలు ఉన్నాయి.. కాష్ పటేల్ రిచ్మండ్ యూనివర్సిటీలో తన అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత లా లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి న్యూయార్క్ వెళ్లారు.. కాష్ పటేల్ గతంలో ఐస్ హాకీ ప్లేయర్ గా కొనసాగారు. ఆ తర్వాత కోచ్ అవతారం కూడా ఇస్తారు.. లా ప్రాక్టీస్ చేసి.. తన కెరియర్ కు ఉజ్వలమైన బాటలు వేసుకున్నారు. ట్రంప్ కేసులు వాదించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో చేరారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version