Mobile Phones in Bathroom: ప్రస్తుతం మానవ జీవితంలో స్మార్ట్ ఫోన్ కూడా ఒక భాగమైందని చెప్పాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశీయ టెలీకాం దిగ్గజం జియో ఎంట్రీతో డేటా వినియోగం పెరగడంతో పాటు వీడియో కంటెంట్ ను చూసేవాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. సినిమాలు, సీరియళ్లతో పాటు వీడియో సాంగ్స్, స్పెషల్ షోలు చూసేవాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
ప్రజలలో చాలామంది వీడియో కాల్స్ ఎక్కువగా చేయడంతో పాటు మార్కెట్ లోకి కొత్తకొత్త గేమ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. చాలామందికి సెల్ ఫోన్ ప్రపంచంగా మారడంతో రోజంతా గేమ్స్ ఆడుతూ గడిపే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొంతమంది బాత్ రూమ్ లో కూడా సెల్ ఫోన్ ను వినియోగిస్తూ గడుపుతుండటం గమనార్హం. బాత్ రూమ్ కు సెల్ ఫోన్ ను తీసుకెళితే ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం ఉంటున్నారు.
Also Read: హీరో అరవింద్ స్వామి భార్య సంపాదన ఎంతో తెలుసా.. నెలకు అన్ని కోట్లా..!
అయితే బాత్ రూమ్ లో సెల్ ఫోన్ ను వినియోగించడం వల్ల ప్రమాదకర బ్యాక్టీరియా ఇంట్లోకి చేరే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ తో బాత్ రూమ్ లో ఎక్కువ సమయం గడిపేవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తేలింది. పెద్దవాళ్లతో పాటు ఈ బ్యాక్టీరియా వల్ల పిల్లలు కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బాత్ రూమ్ లో ఎక్కువ సమయం ఉండటం వల్ల కొంతమందిని పైల్స్ సమస్య వేధిస్తోందని శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది.
Also Read: హీరోయిన్ గౌతమి మొదటి భర్త ఎవరో మీకు తెలుసా.. మనందరికీ సుపరిచితుడే..!
బాత్ రూమ్ లో ఎక్కువ సమయం ఉండటం వల్ల జీర్ణాశయ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే ఆ సమస్యలతో బాధ పడేవాళ్లకు ఆ సమస్యలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయం గడపటం వల్ల సమయం వృథా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
Also Read:
1. సీఎం తన తండ్రి కావడం ఓ అదృష్టమేః కేటీఆర్ ట్వీట్
2. ఏపీకి పాకిన హిజాబ్.. బెజవాడలో కలకలం
3. వివాదాస్పద కామెంట్లు, హౌస్ అరెస్టులు.. ఇంకెన్నాళ్లు రేవంత్.. వీటితో ప్రజాదరణ వస్తుందా ..?
4. గౌతమ్ సవాంగ్‌కు కీలక పదవి.. జగన్ అసలు వ్యూహం ఇదే..!