https://oktelugu.com/

Telugu Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్.. 17 మంది పాపులర్ సెలబ్రెటీలు వీరే!

Telugu Bigg Boss OTT: తెలుగు జనాలకు ‘రియాలిటీ’ని పరిచయం చేసిన షో ‘బిగ్ బాస్’. అనామకులను సైతం ఈ షోతో సెలబ్రెటీలను చేసింది ఈ షో. ఎప్పుడూ ఇలాంటి షో చూడని జనాలు దీన్ని విపరీతంగా ఆదరించారు. అందలమెక్కించారు. బిగ్ బాస్ కోసం టీవీలకు అతుక్కుపోయారు. అలాంటి షో రోజంతా జరగోబోతోంది. ఇన్నాల్లు కేవలం గంట.. గంటన్నర చూస్తేనే జనాలను ఇంతలా ఆకర్షించింది. అలాంటిది రోజంతా వస్తే ఇంకా ఏమైనా ఉంటుందా? సెలబ్రెటీల లూప్ హోల్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 16, 2022 / 10:38 PM IST
    Follow us on

    Telugu Bigg Boss OTT: తెలుగు జనాలకు ‘రియాలిటీ’ని పరిచయం చేసిన షో ‘బిగ్ బాస్’. అనామకులను సైతం ఈ షోతో సెలబ్రెటీలను చేసింది ఈ షో. ఎప్పుడూ ఇలాంటి షో చూడని జనాలు దీన్ని విపరీతంగా ఆదరించారు. అందలమెక్కించారు. బిగ్ బాస్ కోసం టీవీలకు అతుక్కుపోయారు. అలాంటి షో రోజంతా జరగోబోతోంది. ఇన్నాల్లు కేవలం గంట.. గంటన్నర చూస్తేనే జనాలను ఇంతలా ఆకర్షించింది. అలాంటిది రోజంతా వస్తే ఇంకా ఏమైనా ఉంటుందా? సెలబ్రెటీల లూప్ హోల్స్ అన్నీ బయటపడవు. పడుతాయి. అందుకే జనాలకు మరింత ఆసక్తి పెరగడం ఖాయం. అందుకే ఈసారి ‘బిగ్ బాస్’ ఓటీటీని ప్లాన్ చేశారు టీవీ చానెల్ నిర్వాహకులు.

    ఇన్నాళ్లు గంట మాత్రమే చూసిన జనాలకు 24 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను పంచడానికి రెడీ అయ్యింది బిగ్ బాస్ ఓటీటీ. ఫిబ్రవరి 26 శనివారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ప్రోమో విడుదలై అనేక పుకార్లకు చెక్ పెట్టింది. ఇక బిగ్ బాస్ హోస్ట్ నాగార్జుననే ఈ బిగ్ బాస్ ఓటీటీని కూడా హోస్ట్ చేయబోతుండడం విశేషం.

    ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. పాత, కొత్త కలయికతో ఫుల్ కలర్ ఫుల్ గా బిగ్ బాస్ హౌస్ ను తీర్చిదిద్దారట .. రెగ్యులర్ బిగ్ బాస్ కు ఏమాత్రం తగ్గకుండా.. అంతకుమించి అనేట్టుగా ఓటీటీ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారట.. అన్ని సీజన్ల కంటే కూడా ఓటీటీ బిగ్ బాస్ లో క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లు రాబోతున్నారు. బిగ్ బాస్ సీజన్లు ఇప్పటివరకూ 5 జరిగాయి. అందులోని సీజన్ కు ఒకరిని తీసుకొని మిగిలిన వాళ్లను సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి తీసుకున్నారు.

    ప్రయోగాత్మకంగా ప్రారంభమవుతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ లో కంటెస్టెంట్స్ విషయంలో అస్సలు రాజీ పడలేదు. పాపులర్ సెలబ్రెటీలను రంగంలోకి దించుతున్నారు. సీజన్ నుంచి సీజన్ 5 వరకూ పాపులర్ అయిన కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ ఓటీటీలో మళ్లీ బుల్లితెరపైకి తీసుకొని వస్తున్నారు.

    తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్స్ గా రాబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..

    1. మహేష్ విట్టా , కమెడియన్
    2. ధనరాజ్ , కమెడియన్
    3. ముమైత్ ఖాన్
    4. ఆదర్స్, నటుడు
    5. తేజస్వి, నటి
    6.ఆషురెడ్డి , టీవీ యాంకర్
    7. అరియానా గ్లోరి , నటి
    8. సరయూ , యూట్యూబర్
    9. హమీదా, నటి
    10. నటరాజ్ మాస్టర్
    11. యాంకర్ నిఖిల్, యూట్యూబర్
    12. యాంకర్ స్రవంతి చొక్కారావు
    13. ఆర్జే చైతు
    14. యాంకర్ శివ
    15. బమ్ చిక్ బబ్లూ
    16. వెంకట్ (బిగ్ బాస్ విజేత సన్నీ ఫ్రెండ్)
    17. తనీష్ , హీరో

    ఈ 17 మందే కాకుండా అఖిల్ సార్థక్, బిందు మాధవి, అనీల్ రాథోడ్, మిత్రాశర్మ, శ్రీరాపాక, రోహిణీ ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి.

    ఇక ఈ బిగ్ బాస్ తొలి ఓటీటీ 84 రోజులకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఆడియెన్స్ లో స్పందనను బట్టి తగ్గించాలా? పెంచాలా? అన్నది నిర్ణయిస్తారు.. బిగ్ బాస్ 6 మొదలయ్యే వరకూ ఈ ఓటీటీని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు.