Cancer: ఆదమరిస్తే క్యాన్సర్.. ఈ చిన్న తప్పులతో ముప్పు.. లక్షణాలివీ

రోజు రోజుకు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధికి గురవుతున్నారట ప్రజలు. అయితే ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించాలని.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు.

Written By: Swathi, Updated On : March 28, 2024 9:43 am

Cancer

Follow us on

Cancer: మన ఆహారపు అలవాట్ల వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, మారిన వాతావరణాల దృష్ట్యా ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మరి వీటికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే రిస్క్ లో ఉన్నట్టు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రజలను ఎక్కువగా బాధ పెడుతుంది. ఇంతకీ ఎందుకు ఈ క్యాన్సర్ వ్యాధి ప్రస్తుతం రాజ్యమేలుతోంది? దీనికి తీసుకోవాల్సిన నివారణ మార్గాలు ఏంటి? ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ప్రస్తుతం తెలుసుకుందాం.

రోజు రోజుకు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధికి గురవుతున్నారట ప్రజలు. అయితే ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించాలని.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి ఎక్కువగా యువతనే వేదిస్తుందట. పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లు వారసత్వంగా రావడంతో యువత ఈ వ్యాధి బారిన పడుతున్నారు అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం జీవనశైలి, పర్యావరణ కారకాలు, ఆహారం కూడా యువతను క్యాన్సర్ బారిన పడేలా చేస్తున్నాయట.

యువత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 45 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎక్కువ క్యాన్సర్ కు గురి అవుతున్నారని.. కానీ వీరు ముందుగా గుర్తించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. మోషన్ లో బ్లడ్, పొత్తి కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రీసెంట్ గా వేల్స్ కట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.

ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. పొత్తి కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఈమెకు క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారట వైద్యులు. అందుకే మీరు కూడా జాగ్రత్త వహించాలని.. అశ్రద్ద ఉండకూడదు అంటూ ఆమె సలహా ఇచ్చింది. మరి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.