https://oktelugu.com/

Divi Vadthya: నన్ను గెలికితే వాళ్లకే నష్టం… క్యాస్టింగ్ కౌచ్ పై బిగ్ బాస్ దివి సంచలన కామెంట్స్

చిరంజీవి గాడ్ ఫాదర్ లో దివి కీలక పాత్రలో కనిపించింది. దివి లీడ్ రోల్ చేసిన లంబసింగి ఇటీవల విడుదలైంది. లంబసింగి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 28, 2024 / 09:26 AM IST

    Divi Vadthya

    Follow us on

    Divi Vadthya: నటి దివి వాద్త్యా బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ అనంతరం దివి ఫేట్ మారిపోయింది. ఒకప్పుడు అవకాశాలు లేక చిన్న చితకా పాత్రలు చేస్తూ ఉండేది. హీరోయిన్ అవ్వాలని కలలు కంది. గుర్తింపు కోసం దివి ఎన్నో ప్రయత్నాలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు రాణించలేక పోయినప్పటికీ .. రాబట్టింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లలో ఆఫర్స్ దక్కించుకుంటూ నటిగా రాణిస్తుంది. మహర్షి సినిమాలో మహేష్ పక్కన ఓ చిన్న రోల్ చేసింది దివి. కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది.

    చిరంజీవి గాడ్ ఫాదర్ లో దివి కీలక పాత్రలో కనిపించింది. దివి లీడ్ రోల్ చేసిన లంబసింగి ఇటీవల విడుదలైంది. లంబసింగి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. తనకి అటువంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదని దివి చెప్పింది. తనతో పని చేసిన నటులు, దర్శకులు అందరూ మంచి వారని దివి చెప్పుకొచ్చింది.

    దివి మాట్లాడుతూ .. నాతో పని చేసిన వారు వేరే హీరోయిన్లను కమిట్మెంట్ అడుగుతారేమో నాకు తెలియదు. నన్ను మాత్రం ఎవరూ అడగరు. ఒకవేళ అలా అడిగినా నేను ఒప్పుకోను. బహుశా దీన్ని గెలికితే మనకే నష్టం అని అనుకునేలా నా ప్రవర్తన ఉంటుందేమో. నా కెరీర్లో అలాంటి డర్టీ థింగ్స్ కి ఛాన్స్ లేదు. మనం బిహేవ్ చేసే విధానాన్ని బట్టి కూడా ఎదుటి వారి ప్రవర్తన ఉంటుంది. పదేళ్ల తర్వాత నేను మంచి పొజిషన్ లో ఉన్నాను.

    మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి డర్టీ ఎక్స్పీరియన్స్ లు ఉండకూడదు. నేను సోషల్ మీడియాలో గ్లామర్ గా కనిపించినప్పటికీ .. బయట ఎక్కువగా ట్రెడిషనల్ శారీస్ లాంటివే వేసుకుంటాను అని దివి తెలిపింది. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కూడా అందంగా కనిపించవచ్చని తన అభిప్రాయం అని తెలిపింది. ఇక తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని, లేదంటే సున్నితంగా తిరస్కరిస్తానని దివి చెప్పుకొచ్చింది.