Astrology: మనలో చాలామంది నమ్మినా నమ్మకపోయినా మనపై గ్రహాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. గ్రహ సంచారం వల్ల కొన్నిసార్లు మనకు మంచి జరిగితే మరి కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సూర్య భగవానుడు గ్రహాల యొక్క రాజు అనే సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ నుంచి సూర్యుని రాశి పరివర్తనం జరగనుంది. సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తుండగా సూర్యుని రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వాళ్లకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
ఏ రాశులపై సూర్యుని అనుగ్రహం ఉంటుందో వాళ్లకు సూర్యుని అనుగ్రహం వల్ల కష్టాలు, బాధలు తొలగిపోతాయి. కర్కాటకం రాశివాళ్లకు సూర్యుడు రాశిచక్రంలోని 10వ ఇంట్లో సంచరించడం వల్ల కర్మ, కెరీర్ పై ప్రభావం పడుతుంది. కర్కాటక రాశి వాళ్లు ఉద్యోగానికి సంబంధించి త్వరలో శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగం విషయంలో మెరుగైన ఫలితాలు కోరుకునే వాళ్లకు ఖచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది.
సూర్యుని ప్రభావం వల్ల మిథున రాశి వాళ్లు ఏ పని చేసినా ఆ పనిలో అనుకూల ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సూర్యుడు రాశిచక్రంలోని 11వ ఇంట్లో సంచరించడం వల్ల ఆదాయం విషయంలో ఊహించని స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. వ్యాపారులకు ఊహించని స్థాయిలో ధనలాభం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
సూర్యుడు మీనరాశిలో రెండో ఇంట్లో సంచరించడం వల్ల ఈ రాశివాళ్లకు ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు ఉద్యోగం మారే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు ఇదే అనుకూల సమయమని చెప్పవచ్చు. కొత్త ఉద్యోగాలపై ఆసక్తి చూపేవాళ్లకు ఇదే అనుకూల తరుణమని వెల్లడించవచ్చు. ఈ మూడు రాశుల వాళ్లకు సూర్యుడి అనుగ్రహం వల్ల మేలు జరుగుతుంది.