Ind Vs Aus BGT 2024: మొత్తంగా తొలిరోజు భారత్ ఆస్ట్రేలియాపై పై చేయి సాధించింది. ఇప్పటివరకు 83 పరుగుల లీడ్ లో నిలిచింది. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు.. హర్షిత్ రాణా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డి (41), రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ 0 పరుగులకే అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ అయిదు పరుగులకే పె విలియన్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మార్ష్, స్టార్క్, కమిన్స్ తలా రెండు వికెట్లు నేలకూల్చారు. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో కేఎల్ రాహుల్ అవుట్ అయిన తీరు నెట్టింట చర్చకు దారితీస్తోంది. అయితే అతడు అంపైర్ల చేతిలో బలయ్యాడని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో రాహుల్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బ్యాట్ ను తగిలి వెళ్లిందని.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంపైర్ కు అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ ఎంపైర్ అవుట్ అని ప్రకటించలేదు.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు రివ్యూ కి వెళ్ళింది. థర్డ్ అంపైర్ స్నికో మీటర్ ను పరిశీలించాడు. అయితే ఆ బంతి బ్యాట్ సమీపం నుంచి వెళ్తున్న సమయంలో రాహుల్ ప్యాడ్ లకు బ్యాట్ తగిలింది. ఈ క్రమంలో స్నికో మీటర్ లో స్పైక్ కనిపించింది.
అలా ఎలా వచ్చింది
బ్యాట్ కు బంతి తగిలినందు వల్ల అలా వచ్చిందా? బ్యాట్ ప్యాడ్ లకు తగిలినందువల్ల స్నికో అలా చూపించిందా? అనే విషయం ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసింది. అయితే థర్డ్ అంపైర్ ఫ్రంట్ వ్యూ విధానంలో పరిశీలించారు. బంతి వస్తున్న దిశ లో డిఫ్లెక్షన్ చోటుచేసుకుందని.. అందువల్లే అవుట్ ఇచ్చాను అని ప్రకటించారు.. అయితే థర్డ్ అంపైర్ అలా అవుట్ ఇవ్వడంతో రాహుల్ ఆవేదనతో మైదానాన్ని వీడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ తొలి టెస్ట్ కి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా వచ్చాడు. 74 బంతుల్లో అతడు 26 పరుగులు చేశాడు. థర్డ్ అంపైర్ కె.ఎల్ రాహుల్ ను అవుట్ ప్రకటించడంతో సీనియర్ ఆటగాళ్లు మండిపడుతున్నారు. థర్డ్ అంపైర్ నిర్లక్ష్యం వల్ల కేఎల్ రాహుల్ బలయాడని పేర్కొంటున్నారు. సంజయ్ అవుట్ అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. థర్డ్ అంపైర్ చేతిలో రాహుల్ బలయ్యాడని.. అతడు దురదృష్టవంతుడిగా మారిపోయాడని వసీం వక్రం పేర్కొన్నాడు. ఇది అత్యంత హాస్యాస్పదమైన నిర్ణయం అని రాబిన్ ఊతప్ప అది అఖ్యానించాడు.. ఇది చెత్త నిర్ణయమని.. రాహుల్ అవుట్ అని చెప్పడానికి బలమైన కారణం లేదని.. అల్ట్రా ఎడ్జ్ లో థర్డ్ అంపైర్ చూస్తున్నప్పుడు టూ స్పెక్స్ కనిపించలేదా అని ఆకాష్ చోప్రా మండిపడ్డాడు.
A decision that got everyone talking!
OUT or NOT OUT? What’s your take on #KLRahul‘s dismissal?
#AUSvINDOnStar 1st Test, Day 1, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/r4osnDOLyG
— Star Sports (@StarSportsIndia) November 22, 2024