Health Tips: ప్రస్తుతం చాలా సమస్యలకు ఆస్పత్రులకు వెళ్తున్నారు ప్రజలు. తలనొప్పి వచ్చినా సరే తట్టుకోవడం లేదు. కానీ గతంలో ఎలాంటి పెద్ద సమస్యను అయినా సరే తట్టుకొని నిలబడే శక్తి వారికి ఉండేది. ఇదిలా ఉంటే కొన్నిసమస్యలకు ఇంట్లోనే పరిష్కారం వెతుక్కోవచ్చు. వంటిల్లే ఔషధ శాలగా ఉపయోగపడుతుంది. పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి చాలా రకాల పదార్థాలు కొన్ని రకాల సమస్యలను తరిమి కొడతాయి. ఇక నెలసరి నొప్పి అమ్మాయిలను వేధించే పెద్ద సమస్య. కీళ్లనొప్పులు కూడా చాలా మందిలో కనిపించే ప్రధాన సమస్య.
ఈ సమస్యలకు వంటిల్లే పరిష్కారం చూపిస్తుంది. నెలసరి వచ్చినప్పుడు ఆ నొప్పిని భరించలేక చాలా మంది మాత్రలు వేసుకుంటారు. కానీ ఇలా చేయడానికి బదులు కొన్ని టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకు ఆలస్యం ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఓ సారి చూసేద్దాం.
వంటిల్లే ఔషధ శాల అని ఊరికే అంటారా పెద్దలు. మన వంట గదిలో ఉండే పదార్థాలతోనే ఎన్నో రకాల సమస్యలకు నివారణ మార్గాలు వెతుక్కోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ చాలా మందికి వీటిని ఎలా వాడాలో తెలీక ఇబ్బందులు పడుతుంటారు. మన వంటింట్లో ఉండే ఔషధాల్లో అల్లం చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ అల్లాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చు. రెగ్యులర్‌గా అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలను తగ్గించుకోవాలో మీకు తెలుసా?
అల్లం రసం తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయిన టాక్సిన్స్ ను తరిమి కొట్టవచ్చు. అలాగే గ్యాస్, అజీర్తి, అసిడిటీ సమస్యల నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది. అల్లం రసంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల.. శరీరంలో మంట పూర్తిగా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధ పడేవారు అల్లం రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగి మీ సమస్యలు దూరం అవుతాయి. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. జలుబు, దగ్గు నుంచి బయటపడవచ్చు.
హీటింగ్ ప్యాడ్: నొప్పి ఉన్న ప్రదేశంలో వేడినీళ్లు నింపిన హీటింగ్ ప్యాడ్‌తో కాపడం వల్ల మీకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెలసరిలో ఉన్నన్ని రోజులూ వేడినీటి స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేసినా కండరాలు రిలాక్స్ అయి, నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్నిస్తుంది. పగటివేళ కొద్దిసేపు కునుకు తీయాలి. మంచి నిద్ర చాలా అవసరం. ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. ఉప్పు శరీరంలో నీరు నిలిచి ఉండేలా చేస్తుంది కాబట్టి శరీరం బరువుగా తయారై అసౌకర్యంగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..