How much water to drink: ఈ సృష్టిలో ఉన్న ప్రతీ జీవికి నీరు ముఖ్యమే. నీరు లేకపోతే అసలు ఆరోగ్యమే ఉండదు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బాడీ హైడ్రేట్‌గా ఉండాలన్నా నీరు తాగడం ముఖ్యం. రోజూ నీరు తాగడం వల్ల శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అయితే చాలామంది వర్క్ బిజీలో పడి నీరు చాలా తక్కువగా తాగుతారు. ఇలా తక్కువగా తాగితే ఎక్కడలేని అనారోగ్య సమస్యలన్నీ మిమ్మల్ని చుట్టుకుంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మనలో చాలామందికి నీరు ఎప్పుడు? ఎలా తాగాలి? ఏ సమయంలో ఎంత నీరు తాగాలో తెలియదు. రోజుకి నీరు ఎక్కువగా తాగాలనే విషయం అందరికీ తెలుసు. కానీ ఏ సమయంలో ఎంత నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారో తెలియదు. నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఒకే రోజు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. మరి రోజూ ఏ సమయానికి ఎంత మోతాదులో నీరు తీసుకోవాలో చూద్దాం.
ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాదు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఆహారం తినే ముందు నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే నీరు తాగిన వెంటనే కడుపు నిండుగా అనిపించి తక్కువగా ఫుడ్ తీసుకుంటారు. దీనివల్ల తొందరగా బరువు తగ్గుతారు. భోజనం తినే ముందు కంటే తర్వాత నీరు తప్పకుండా తాగాలి. వ్యాయామం, ఏదైనా పని చేసేటప్పుడు నీరు అధికంగా తాగాలి. ఎందుకంటే ఎక్కువగా పనిచేస్తే.. చెమట ద్వారా నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగాలి.
కొందరు తొందరగా నిలబడి నీరు తాగుతారు. నీళ్లు అనేవి కూర్చొని నెమ్మదిగా మాత్రమే తాగాలి. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు, మోకాళ్లు దెబ్బతింటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్క్వాట్ పొజిషన్‌లో కూర్చుని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కూర్చొని నీళ్లు తాగడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అయితే ఒకేసారి ఎక్కువ నీరు తాగకుండా 15 నిమిషాలకు ఒకసారి కొంచెం కొంచెం తాగుతుండాలి. నీరు తక్కువగా తాగితే జుట్టు, చర్మ సమస్యలతో పాటు మలబద్దకం, జీర్ణ సమస్యలు వస్తాయి. రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే శరీరంలో ఉండే విషపదార్థాలను కూడా తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.