Low Blood Pressure: లోబీపీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తే శాశ్వత పరిష్కారం అందుతుంది..

లోబీపీ లక్షణాలు తెలుసుకొని వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. మైకము, అలసట, తలనొప్పి, కడుపులో తిమ్మరి, హృదయ స్పందన రేటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు తిరగడం వంటివి లోబీపీ లక్షణాలు.

Written By: Swathi, Updated On : April 11, 2024 4:13 pm

Low Blood Pressure

Follow us on

Low Blood Pressure: ప్రస్తుత కాలంలో చాలా మంది లోబీపీ సమస్యతో బాధపడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, వంశపారంపర్యంగా, సరైన రక్త ప్రసరణ లేకపోతే ఈ సమస్య వస్తుంటుంది. కొందరికి మాత్రం కాలక్రమేణ ఈ వ్యాధి వస్తుంది. ఇంతకీ లో బీపీ అంటే ఏమిటి అనుకుంటున్నారా? సాధారణ రక్త పోటు కంటే తక్కువ ఉంటే లోబీపీ అని ఎక్కువ ఉంటే హైబీపీ అని అంటారు. రక్తపోటు సాధారణంగా 120/80 MMHG గా ఉండాలి. తక్కువ అయితే లోబీపీ గా పరిగణిస్తారు. దీన్ని నార్మల్ గా ట్రీట్ చేయవద్దు. జాగ్రత్త వహించాలి.

ఇక లోబీపీ లక్షణాలు తెలుసుకొని వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. మైకము, అలసట, తలనొప్పి, కడుపులో తిమ్మరి, హృదయ స్పందన రేటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు తిరగడం వంటివి లోబీపీ లక్షణాలు. అయితే ఈ లోబీపీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. డీ హైడ్రేషన్, గుండెలో రక్తం గడ్డకట్టడం, విటమిన్ బీ12, అడ్రినలిన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం వంటి వాటివల్ల లోబీపీ ఏర్పడుతుంది.

లోబీపీ నుంచి బయటపడటం సమస్య కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మారిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. తగినంత నీరు తీసుకోవాలి, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం కచ్చితంగా చేస్తుండాలి, మద్యం సేవించడం, సిగరేట్ తాగడం మానేయాలి. ఏవైనా మందులు వాడుతుంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి వైద్యులను అడిగి తెలుసుకోండి. ఆహారంలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉండేలా చూసుకోండి. తక్కువ తిని ఎక్కువ సార్లు భోజనం చేయండి.

లోబీపీతో కళ్ళు తిరిగి పడిపోతే, మైకం కమ్మిన వెంటనే ఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ సైంధవ లవణం కలిపి తాగండి. దీని వల్ల వెంటనే బీపీ నార్మల్ అవుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. బీపీని కంట్రోల్ చేసి, నార్మల్ స్థితికి తీసుకొని వస్తుంది. మరి తెలుసుకున్నారు కదా ఈ జాగ్రత్తలు తీసుకొని మీ బీపీని నార్మల్ గా ఉంచుకోండి.