గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే చిట్కాలు ఇవే?

మనలో చాలామందిని వేధించే సమస్యలలో గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఒకటి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆలోచనా తీరు, ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. ఇంటి ఫుడ్ కంటే హోటల్ ఫుడ్ ను తినేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. ఇంట్లో దొరికే ఆహార పదార్థాల ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆహారం సరిగ్గా జీర్ణం కాని పక్షంలో గ్యాస్ […]

Written By: Navya, Updated On : November 14, 2021 4:59 pm
Follow us on

మనలో చాలామందిని వేధించే సమస్యలలో గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఒకటి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆలోచనా తీరు, ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. ఇంటి ఫుడ్ కంటే హోటల్ ఫుడ్ ను తినేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. ఇంట్లో దొరికే ఆహార పదార్థాల ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

ఆహారం సరిగ్గా జీర్ణం కాని పక్షంలో గ్యాస్ ట్రబుల్ సమస్య తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ రెండు టీస్పూన్ల అల్లం రసం తాగితే గ్యాస్ సమస్య దూరమవుతుంది. ఆహారం జీర్ణం కావడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుందనే సంగతి తెలిసిందే. కొబ్బరినీళ్లు కూడా గ్యాస్ సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి. కొబ్బరినీళ్లలో ఉండే ప్రోటీన్లు ఈ సమస్యను దూరం చేస్తాయి.

లవంగాల సహాయంతో కూడా గ్యాస్ సమస్య దూరమవుతుంది. భోజనం చేసిన తర్వాత ల‌వంగాన్ని నోట్లో వేసుకుని నమిలితే గ్యాస్ తగ్గుతుంది. జీలకర్రను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగినా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. గ్యాస్ సమస్యకు ఒత్తిడి, ఆందోళన కూడా ఒక విధంగా కారణమవుతాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా గ్యాస్ ట్రబుల్ సమస్య దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకున్నా గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గకపోతే డాక్టర్లను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఈ విధంగా గ్యాస్ ట్రబుల్ సమస్యకు సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.