https://oktelugu.com/

AKHIL: రెండు ఓటీటీ ప్లాట్​ఫామ్​ల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​’.. స్ట్రీమింగ్​ ఎప్పుడంటే!

AKHIL: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్​ అక్కినేని హీరోగా తెరకెక్కించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్​. ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్​గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా.. మంచి హిట్​ టాక్​ను అందుకుంది. రొమాంటిక్​ లవ్​స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. కరోనా పరిస్థితులను సైతం తట్టుకుని.. ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమా ఇది. దీంతో అటు అఖిల్​తో పాటు, దర్శకుడు భాస్కర్​కూ మంచి బ్రేక్​ లభించినట్లైంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 14, 2021 / 04:48 PM IST
    Follow us on

    AKHIL: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్​ అక్కినేని హీరోగా తెరకెక్కించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్​. ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్​గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా.. మంచి హిట్​ టాక్​ను అందుకుంది. రొమాంటిక్​ లవ్​స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. కరోనా పరిస్థితులను సైతం తట్టుకుని.. ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమా ఇది. దీంతో అటు అఖిల్​తో పాటు, దర్శకుడు భాస్కర్​కూ మంచి బ్రేక్​ లభించినట్లైంది.

    కాగా, తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గీతాఆర్ట్స్‌-2 బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు ఆహా అంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా స్ట్రీమింగ్​ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ.. అభిమానులకు ఊరట పెంచారు. దసరా కానుకగా అక్టోబరు 15న విడుదలైన ఈ సినిమాను నవంబరు 19న ఆహాలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

    కాగా, ఆహాతో పాటు, నెట్​ఫ్లిక్స్​లోనూ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్​ చేయనున్నట్లు ప్రకటించడం విశేషం.  బిగ్‌ స్క్రీన్‌పై లాభాలు సృష్టించిన ఈ సినిమా.. అఖిల్‌ కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు.   మరి డిజిటల్‌ స్క్రీన్‌పై ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందో చూడాలి. ఇంకెందుకు ఆలస్యం ఆహా, నెట్​ఫ్లిక్స్​ల్లో కనెక్ట్ అయిపోయి రెడీగా ఉండండి.