Problems In Men: మారుతున్న కాలంతో పాటే కొంతమంది పురుషులు, మహిళలు ఒంటరి జీవితాన్ని గడపటానికి ఎంతగానో ఇష్టపడుతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఒంటరి జీవితాన్ని గడుపుతుంటే మరి కొందరు పెళ్లి తర్వాత భాగస్వామి చనిపోవడం లేదా విడాకులు తీసుకోవడం వల్ల ఒంటరి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఎక్కువకాలం ఒంటరి జీవితం గడపటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
ఒంటరితనం వల్ల కొన్నిసార్లు శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి. 4835 మంది పురుషులపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన ఫలితాలను వెల్లడించారు. శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం 48 నుంచి 62 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిని ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, మరణాలు సంభవించడం ఒంటరితనంతో జీవిస్తున్న పురుషులను వేధిస్తోందని నివేదికలో వెల్లడవుతోంది.
Also Read: తినడానికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలివే!
ఎక్కువకాలం ఒంటరితనంతో జీవించడం వల్ల శారీరక, మానసిక సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒంటరిగా జీవించే వాళ్లలో రక్త కణాలలో తేడాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒంటరితనం వయసు సంబంధిత అనారోగ్యాలకు దారి తీసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒంటరిగా జీవించే వాళ్లు వ్యక్తిగత శుభ్రతను పాటించడం సాధ్యం కాదు.
వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్లు వీలైనంత వరకు పనితో బిజీగా ఉంటూ స్నేహితులకు, బంధువులకు తమ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదో ఒక వ్యాపకాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కూడా ఒంటరితనాన్ని దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: మనుషులను నాశనం చేసే ఐదు ప్రమాదకరమైన అలవాట్ల గురించి మీకు తెలుసా?