Stress Relief Alcohol: అలజడితో ఉన్న మనసు ప్రశాంతంగా మార్చే ద్రవం మందు అని కొందరి అభిప్రాయం. ఇందులో భాగంగా రోజువారి ఒత్తిడి నుంచి దూరం కావడానికి.. మద్యం సేవించడం అలవాటుగా మారిపోయింది. కొందరు ప్రతిరోజు రెండు పెగ్గులు లేకుంటే నిద్ర పోకుండా ఉంటారు. మరికొందరు ప్రతిరోజు మత్తులో ఉంటేనే వారికి మజాగా ఉంటుంది. అయితే మద్యపానం ఎప్పటికైనా అనారోగ్యమే అని ఎంతోమంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నా.. ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే కొందరి అభిప్రాయం ప్రకారం మాత్రం మద్యం సేవించడం వల్ల గుండె సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు. ఈ క్రమంలో సింగిల్ గా మద్యం సేవించడం కంటే స్నేహితుడు లేదా మరొకరితో మద్యం సేవించడం వల్ల ఎంతో హాయిగా ఉంటుందని చెబుతుంటారు. అయితే సింగిల్ గా కాకుండా ఇతరులతో మద్యం సేవించడానికి ఏమంటారో తెలుసా?
సాధారణంగా ఎవరైనా ఎక్కువగా మద్యం సేవిస్తే వారిని తాగుబోతు అని అంటారు. మరికొందరు డ్రింకర్ అని పిలుస్తుంటారు. అయితే తాగుబోతు అని వాడడంలో ఒక విశేష అర్థం దాగి ఉంది. అదేంటంటే తాగుబోతు.. అంటే ఇందులో బోత్ అనేది ఇంగ్లీష్ పదం గా పరిగణించవచ్చు. ఇంగ్లీషులో Both అంటే ఇద్దరు అని అర్థం. ఇద్దరు కలిసి మద్యం సేవిస్తేనే మజాగా ఉంటుందని కొందరు అంటుంటారు. అందుకే తప్పనిసరిగా ఇద్దరు మద్యం తాగాలని చెబుతూ.. అలా తాగే వారిని తాగుబోతు అని పిలుస్తుంటారు అని చెబుతుంటారు. తాగుబోతు వల్ల ఒకరి భావాలు మరొకరు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకరికి ఉన్న కష్టాలు మరొకరికి చెప్పుకోవచ్చు. అలాగే అప్పటివరకు ఉన్న అలజడిని దూరం చేసుకోవచ్చు అని కొంతమంది అభిప్రాయం.
Also Read: ఆకలిగా ఉందని సమోసా కొన్నారు.. తుంచి చూడగా షాక్: వైరల్ వీడియో
ఒకరు మద్యం తాగడం కంటే.. ఇద్దరు కలిసి మద్యం సేవించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. అప్పటివరకు ఒంటరిగా ఫీలయిన వారు మరొక వ్యక్తితో కలిసి మద్యం సేవించడంతో.. ఎంతో ఉల్లాసంగా మారిపోతాడు. అతనిలో ఉన్న ఒంటరితనం అనే ఫీలింగ్ మాయమైపోతుంది. అంతేకాకుండా తనకు ఏదో శక్తి తోడై ఉందని భావిస్తాడని అంటారు. ఇలా అనుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని.. ఫలితంగా ఏ పని అయినా చేయడానికి శక్తి వస్తుందని చెబుతుంటారు.
కొంతమంది ఇంట్లోనే మద్యం సేవించాలని కోరుతూ ఉంటారు. కానీ ఇంట్లో మద్యం సేవించడం కంటే స్నేహితులతో కలిసి లేదా ఇతర వ్యక్తులతో కలిసి మద్యం సేవించడం వల్ల ఎన్నో రకాల సంతోషాలు అలవాటుతాయి. అంతేకాకుండా నలుగురితో కలిసి మద్యం సేవించడం వల్ల మనసు ఉల్లాసంగా మారి ఆ తర్వాత రోజు అదనపు శక్తి అందుతుంది.
అయితే ఏదైనా మితిమీరితే ప్రమాదమే. మద్యం కూడా అతిగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు. ముఖ్యంగా నేటి కాలంలో కల్తీ మద్యం తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఇటీవల వైద్యుల సర్వేలో తేలింది. అయితే వీకెండ్ లేదా మంత్ ఎండింగ్ పార్టీలకు మినహాయించి ప్రతిరోజు తాగితే మాత్రం ఆయుష్షును తగ్గించుకున్నట్లేనని కొందరు చెబుతున్నారు.