https://oktelugu.com/

Stomach Issues: కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. దీంతో చెక్ పెట్టండిలా!

కడుపు ఉబ్బరంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిట్కా తప్పనిసరిగా పాటించండి. ఇంతకీ ఆ చిట్కా ఏంటో మరి పూర్తి స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2024 / 01:00 AM IST

    stomach issues

    Follow us on

    Stomach Issues: తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది కడుపు ఉబ్బరం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య బారిన పడితే సరిగ్గా ఏ ఆహారం కూడా తీసుకోలేరు. ఒకవేళ తిన్నా కూడా అది జీర్ణం కాక ఇబ్బందులు వస్తాయి. ఈ సమస్యను భరించలేక కొందరు అనేక రకాల మందులు కూడా వాడుతుంటారు. అయిన కూడా సమస్య తగ్గకుండా పెరుగుతుంది. ఈ మందులు కేవలం ఆ నిమిషానికి ఉపశమనం కల్పించిన ఆ తర్వాత ఇబ్బంది పెడతాయి. తాత్కాలికంగా కాకుండా పూర్తిగా ఈ సమస్య నుంచి విముక్తి చెందాలంటే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చిట్కాలు పాటిస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. కొందరికి తెలియక కడుపు ఉబ్బరానికి డబ్బులు ఎక్కువగా వెచ్చిస్తారు. దీనివల్ల సమస్య తగ్గితే పర్లేదు. కానీ తగ్గకుండా ఇబ్బంది పెడితే మాత్రం మళ్లీ కష్టం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిట్కా తప్పనిసరిగా పాటించండి. ఇంతకీ ఆ చిట్కా ఏంటో మరి పూర్తి స్టోరీలో తెలుసుకుందాం.

     

    కడుపు సంబంధిత సమస్యలు అన్నింటి నుంచి విముక్తి చెందాలంటే వాము చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి అన్ని సమస్యలకు కూడా వాము చక్కటి పరిష్కారం. ఇందులో ఆయుర్వేద పోషకాలు ఉన్నాయని దీన్ని ఔషధంగా కూడా వాడుతుంటారు. అయితే వాములో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. వాములోని ప్రోటీన్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సాయపడతాయి. అలాగే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడతారు. వీటితో పాటు అజీర్ణం, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలన్నింటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

     

    వాములో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే బాగా కడుపు నొప్పి ఉన్నవారు వామును వంటల్లో వాడవచ్చు. లేదా వాము రైస్ చేసుకుని కూడా తినవచ్చు. లేదా వాము పొడిని తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని కూడా తినవచ్చు. ఇలా తినడం వల్ల వాములోని పోషకాలు శరీరానికి అందుతాయి. దీంతో కడుపు సమస్యలన్నీ కూడా తొందరగా తగ్గుతాయి. వాము పొడిని కూడా వాటర్‌లో కలిపి తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కొందరు డైలీ ఉదయం పూట టిఫిన్ కింద వాము రైస్ చేసుకుని తింటారు. దీనివల్ల ఫుడ్ ఈజీగా జీర్ణం కావడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. వామును పిండి వంటల్లో కూడా ఎక్కువగా వాడుతుంటారు. దీని వల్ల వంటలు టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలను చేకూరుస్తుంది. కాబట్టి ఏదో విధంగా వాము రైస్ తీసుకోవడం ఉత్తమం.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.