https://oktelugu.com/

America : భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం ఇదే!

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య రెండేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఐదారు నెలల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం.. ఏళ్లుగా కొనసాగుతోంది. చిన్న దేశమైన ఉ్ర‘కెయిన్‌కు అమెరికాతోపాటు నాటో దేశాల సహకారం అందిస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 3, 2024 / 01:15 AM IST

    America

    Follow us on

    America :  ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అయింది. అయినా.. ఇరు దేశాల మధ్య ఇప్పటికీ రాజీ కుదరలేదు. ఏ దేశం కూడా ఓటమిని అంగీకరించడం లేదు. చిన్న దేశం అయిన ఉక్రయిన్‌పై రష్యా నెల, రెండు నెలల్లో విజయం సాధిస్తుందని రష్యాతోపాటు ప్రపంచ దేశాలు భావించాయి. కానీ, ఉక్రెయిన్‌కు అమెరికా, యూకెతోపాటు నాటో దేశాలు ఆయుధ, ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టం జరిగినప్పటికీ యుద్ధంలో వెనుకడుగు వేయడం లేదు. ఇదిలా ఉంటే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సాకుగా చూపి అమెరికా భారత కంపెనీలపై ఆంక్షలు విధించింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భారత్, చైనా, స్విట్జర్‌లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలు ఉన్నాయి.

    రష్యాకు సహకారం చేస్తున్నాయని..
    ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ ఆంక్షలు విధించింది. దాదాపు 275 కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా రష్యాకు సహకరిస్తున్నట్లు అమెరికా గుర్తించింది. ఈ క్రకమంలో ఉక్రెయిన్‌కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆంక్షలు విధించినట్లు అమెరికా వర్గాలు తెలిపారు.

    15 భారత కంపెనీలపై..
    అమెరికా ఆంక్షలు విధించిన కంపెనీల్లో భారత్‌కు చెందిన 15 కంపెనీలు ఉన్నాయి. రష్యాకు సాయం చేస్తున్నాయన్న కారణంతోనే ఆంక్షలు విధించింది. భారత్‌కు సంబంధించిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు.

    1. అభర్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    2. డెన్వాస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    3. ఎమ్సిస్టెక్‌

    4.:ఎలాక్సీ బేరింగ్స లిమిటెడ్‌

    5. ఆర్బిట్‌ ఫినైట్రేడ్‌ ఎల్‌ఎల్పీ

    6. ఇన్నోవియో వెంచర్స్‌

    7. కేడీజీ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    8. ఖుష్బూ హూనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    9. లోకేష్‌ మెషీన్స్‌ లిమిటెడ్‌

    10. పాయింటర్‌ ఎలక్ట్రానిక్స్‌

    11. ఆర్‌ఆర్‌జీ ఇంజినీరింగ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    12. షార్ప్‌ లైన్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    13. శౌర్య ఏరోనాటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    14. శ్రీఘీ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

    15. శ్రేయ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌