Kachariya : సంజీవని కూరగాయ… చనిపోయేవారిని బతికించేంత పవర్.. రేర్ గా దొరికే దీన్ని అస్సలు వదలకండి

కేవలం ఒక రెండు నెలలు మాత్రమే మార్కెట్ లో దొరికే ఈ కచారియా కూరగాయలు సాధారణ రేట్లు ఉంటాయి. కిలో రూ. 40 నుంచి రూ. 80 వరకు ఉంటుంది. గ్రామాల్లో అయితే ఎలాంటి రసాయనాలు లేనివి దొరుకుతాయి.

Written By: Kusuma Aggunna, Updated On : September 17, 2024 3:09 pm

Special story about Sanjeevani Kuragaya Kacharia (Budam Cucumber)

Follow us on

Kachariya : భారతదేశంలో ఎన్నో రకాల కూరగాయలు ఉన్నాయి. ప్రతి ఒక కూరగాయలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కొన్ని కూరగాయలు సీజన్ లో మాత్రమే దొరుకుతాయి. చాలా అరుదుగా దొరికే వాటిని ఆ సమయంలో మాత్రమే తినాలి. తర్వాత తినాలి అనుకున్న దొరకదు. అలాంటి వాటిలో ఉన్న కచ్రీ కూరగాయ ఒకటి. దీనిని కచారియా లేదా సంజీవని కూరగాయ అని కూడా అంటారు. వర్షాకాలంలో కేవలం రెండు నెలలు మాత్రమే లభించే ఈ కచ్రీ కూరగాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఇవి తినడానికి కూడా రుచిగా ఉంటాయి. అయితే మార్కెట్ లో ఈ కూరగాయలు కొన్ని రోజులు మాత్రమే దొరుకుతాయి. ఆ సమయంలోనే వీటిని తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. సంజీవనీ కూరగాయగా.. అన్ని రోగాలు నయం చేసే పవర్ ఉన్న దానిగా వర్ణిస్తారు. చావుబతుకుల్లో ఉన్నా ఇది తింటే త్వరగా కోలుకుంటారని చెబుతారు.  అయితే ఎన్నో పోషకాలు ఉన్న ఈ కచారియా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మరి చూద్దాం.

మార్కెట్ లో అరుదుగా దొరికే ఈ కచారియాను రోజు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో దీనిని బుడం దోసకాయ అని కూడా అంటారు. కేవలం రెండు నెలలు మాత్రమే దొరికే ఈ కూరగాయను ఎక్కువగా గ్రామాల్లోని ప్రజలు తింటారు. పొలాల మధ్యలో ఎక్కువగా ఇది పండుతుంది. తినడానికి రుచిగా ఉండటం వల్ల ఈ కూరగాయను ఎక్కువగా తింటుంటారు. ఇది అధికంగా వర్షాకాలంలో ఎక్కువగా పండుతుంది. వీటి మొక్కలను నాటాల్సిన అవసరం లేదు. వాటంతటా అవే పెరుగుతాయి. ఇవి పొలాల మధ్యలో పొదలుగా కనిపిస్తాయి. ఇది చూడటానికి చిన్నగా, ఆకుపచ్చని రంగులో ఉంటుంది. తినడానికి ఈ కాయ చాలా రుచిగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల విటమిన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలాగే కండరాలు బలంగా ఉంచడంతో పాటు కడుపు నొప్పి, మలబద్ధకం వంటివి తగ్గించడంలో కూడా ఇది సహాయడుతుంది. రోజు తినడం వల్ల వీటిని శరీరంలో ఉండిపోయిన మలినాలు బయటకు వస్తాయి. అలాగే కాలేయం, మూత్రపిండాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. గుండె పోటు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది.

కేవలం ఒక రెండు నెలలు మాత్రమే మార్కెట్ లో దొరికే ఈ కచారియా కూరగాయలు సాధారణ రేట్లు ఉంటాయి. కిలో రూ. 40 నుంచి రూ. 80 వరకు ఉంటుంది. గ్రామాల్లో అయితే ఎలాంటి రసాయనాలు లేనివి దొరుకుతాయి. అదే పట్టణాల్లో అయితే కెమికల్స్ కలిపినవి ఎక్కువగా ఉంటాయి. అవసరమైతే వీటిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. చిన్న కుండీలో పెంచుకున్న ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు అంటే మీరు ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించడం వల్ల శరీరానికి మేలు చేకూరుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.