https://oktelugu.com/

Bigg Boss 5: బిగ్ బాస్ లో షన్ను ని కాదని వేరే కంటస్టెంట్ కి మద్దతు తెలుపుతున్న దీప్తి సునైనా…

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. బిగ్ బాస్ లోని ఇంటి సభ్యులంతా వారి వారి శైలిలో అందరూ బాగానే ఆడుతున్నారు. గతంలో మాదిరి ఈ సీజన్ కూడా టి‌ఆర్‌పి పరంగా దూసుకుపోతూ ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. ఇప్పటికీ స‌క్సెస్ ఫుల్‌గా 12 వారాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ సీజన్ లో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ గురించి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 08:55 AM IST
    Follow us on

    Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. బిగ్ బాస్ లోని ఇంటి సభ్యులంతా వారి వారి శైలిలో అందరూ బాగానే ఆడుతున్నారు. గతంలో మాదిరి ఈ సీజన్ కూడా టి‌ఆర్‌పి పరంగా దూసుకుపోతూ ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. ఇప్పటికీ స‌క్సెస్ ఫుల్‌గా 12 వారాలు పూర్తి చేసుకుంది. కాగా ఈ సీజన్ లో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలతో ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    deepthi sunaina supporting tamil bigg boss 5 contastant varun

    Also Read: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో టికెట్ టు ఫీనాలే గెలిచింది అతడే…

    కాగా దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్ లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. దీప్తి గతంలోనే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అలరించగా ఇప్పుడు షన్ను సీజన్ 5 లో అలరిస్తున్నారు. సీజన్ స్టార్టింగ్ నుంచి షణ్ముఖ్ కి సపోర్ట్ చేస్తుంది దీప్తి. తన ఇన్స్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో కూడా అతనిని సపోర్ట్ చేస్తూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. ఆ మధ్య షన్ను ఫ్యామిలీ మెంబర్ గా వెళ్ళిన దీప్తి హౌస్ లో అలరించి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పటి వరకు ష‌ణ్ముక్ కు ఓట్లు వేసి గెలిపించాల‌ని కోరిన దీప్తి ఇప్పుడు ప్లేట్ మార్చింది.

    బిగ్‌బాస్‌ లో మరో కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్దతు ఇవ్వ‌డం సంచ‌ల‌నం గా మారింది. అలానే తాను ఓటు వేసిన స్క్రీన్ షాట్ ను సైతం సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం విశేషం. ఈ భామ మద్దతు తెలిపింది తెలుగు బిగ్ బాస్ లో కాదు. తమిళ్ బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ వరుణ్ అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు కి కూడా దీప్తి మద్దతు తెలిపింది. అత‌డికి ఓట్లు వేసి గెలిపించాలంటూ దీప్తి త‌న ఫాలోవ‌ర్ల‌ను కోరింది. దీంతో ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

    Also Read: నిజాలు బయటపెడితే అందరూ షాక్ అవుతారు.. జరిగేది వేరు చూపించేది వేరు