Almond Benefits: బాదం పప్పు.. డ్రైఫ్రూట్స్ లో ఒకటైన బాదంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. బాదంలో విటమిన్-ఈ, పీచు పదార్థాలు, మాంగనీస్, కాపర్, రైబోప్లోవిన్ మరియు కాల్షియం ఉంటాయి. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. దీని కారణంగా బాదం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతారు. అందుకే బాదంను పోషకాహార పవర్ హౌస్ అని అభివర్ణిస్తారు.
బలమైన ఎముకల కోసం, బరువు తగ్గడానికి బాదంపప్పును రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. అలాగే దీని వలన గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి రోగాలకు కాస్తా దూరంగా ఉండొచ్చట.
అయితే బాదంపప్పు తీసుకోవడం వరకు ఓకే కానీ..దాన్ని నానబెట్టి తినాలా? లేక నానబెట్టకుండా తీసుకోవాలా? అనేది చాలా మందికి మొదటగా తలెత్తే ప్రశ్న. ఎలా తీసుకోవడం మంచిదని ఆలోచిస్తుంటారు. ఈక్రమంలో ఈ రెండు పద్ధతుల్లో ఏదీ మంచిదనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన శరీరానికి మెరుగైన పోషకాలు లభించాలంటే బాదంను నానబెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వలన యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాల ఎక్కువగా లభిస్తాయి. బాదంలో ఉండే ముఖ్యమైన ఖనిజం భాస్కరం. నానబెట్టిన తరువాత ఈ ఖనిజం మరింత సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరంలో ఎముకల ఆరోగ్యానికి, దంత సంరక్షణకు మరియు వివిధ శారీరక విధులకు దోహదం చేస్తుంది.
అంతేకాకుండా బాదంను నానబెట్టడం వలన జీవక్రియ మెరుగవడంతో పాటు పోషకాల శోషణకు ఆటంకం కలిగించే మలినాలను సైతం తొలగిస్తుంది.
అదేవిధంగా ఫైటిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. నానబెట్టిన సమయంలో బాదం తొక్కలో ఉండే పాలీఫైనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు యాక్టివేట్ అవుతాయి. దీని వలన సెల్యులార్ ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయం చేస్తాయి. అలాగే బాదంను నానబెట్టి తీసుకోవడం వలన లిపేస్ తో సహా ఇతర ఎంజైమ్ ల విడదులను ప్రేరేపిస్తుందని తెలుస్తోంది. ఇది కొవ్వులను విచ్చిన్నం చేయడంతో పాటు మెరుగైన జీవక్రియకు పని చేస్తుంది.
ఈ విధంగా నానబెట్టిన బాదం వలనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి మేలు చేస్తుంది.