Tollywood Directors : పూరి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ, పరుశురామ్ సినిమాలకు కాలం చెల్లిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని కొత్త కథలు వచ్చినప్పటికి కొంత మంది దర్శకులు పాత కథలను మాత్రం వదిలిపెట్టడం లేదు...దానివల్లే తెలుగు ఇండస్ట్రీ లో ప్లాప్ సినిమాల పర్సంటేజ్ పెరుగుతూ పోతుంది...

Written By: Gopi, Updated On : August 17, 2024 6:45 pm

Tollywood Directors

Follow us on

Tollywood Directors : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు పోటీపడుతూ ముందుకు సాగుతుంది. ఇక ఎప్పుడైతే రాజమౌళి ‘బాహుబలి ‘ సినిమా చేశాడో అప్పటినుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా అనేది కొనసాగుతూ వస్తుంది. అలాగే పాన్ ఇండియా లో కూడా తెలుగు సినిమాల ప్రభావం అనేది పెద్ద ఎత్తున ఉందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా తెలుగు సినిమా హవా హాలీవుడ్ రేంజ్ లో విస్తరించిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ఇండియన్ సినిమా స్థాయిని వరల్డ్ స్థాయిలో విస్తరింప చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమాతో రాజమౌళి అక్కడ ఉన్న దర్శకులకు పోటీ ఇవ్వడమే కాకుండా మహేష్ బాబును కూడా వరల్డ్ హీరోని చేయడంలో కీలక పాత్ర వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లు మాత్రం ఇంకా రొటీన్ సినిమాలే చేస్తున్నారు.

అందులో ముఖ్యంగా పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, పరుశురాం లాంటి డైరెక్టర్లు రొటీన్ రొట్ట సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపును సంపాదించుకొబోతున్నారు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు స్క్రీన్ మీద విజువల్స్ వండర్స్ ను క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతుంటే వీళ్ళు మాత్రం సింపుల్ గా కమర్షియల్ జానర్ లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నారు.

నిజానికి వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా వీళ్ళ సినిమాలు ఉండడం లేదు. దానివల్ల పాన్ ఇండియా లో వాళ్ళను వాళ్ళు డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోకపోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని కూడా చాలా వరకు దెబ్బతీస్తున్నారు… మరి ఇలాంటి సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు చేస్తున్న పొరపాటు వల్లే తెలుగులో చాలామంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెత్త కథలు వస్తున్నాయనే ఒక రూమర్ అయితే బయట బాగా స్ప్రెడ్ అవుతుంది…

ఇక ఈ ఔడేటెడ్ డైరెక్టర్లకి కాలం చెల్లిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే వీళ్ళు చేస్తున్న సినిమాల్లో కొన్ని సక్సెస్ అయినప్పటికీ మెజారిటీ పీపుల్స్ కి మాత్రం వీళ్ళ సినిమాలు అస్సలు నచ్చడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్లు ఇక మీదట సినిమాలు చేయకుండా ఉంటే మంచిది అంటూ ప్రేక్షకులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…