Hot Food: మనలో చాలామంది వేడి ఆహారాన్ని తినడానికి చాలా ఇష్టపడతారు. శీతాకాలంలో వేడి ఆహారం తినాలని మరింత ఎక్కువ మంది భావిస్తారు.వేడి ఆహారం రుచిగా ఉంటుందనే కారణం వల్లే ఈ ఆహారంపై ఆసక్తి చూపే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే వేడి ఆహారం వల్ల శరీరానికి హాని జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మరీ వేడివేడిగా ఉండే ఆహారం వల్ల శరీరానికి కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మరీ వేడిగా మరీ చల్లగా ఉన్న ఆహార పదార్థాల వల్ల దంతాలకు హాని కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే వేడి ఆహారం తీసుకుంటారో వాళ్లకు ఎనామిల్ లో పగుళ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫలితంగా దంతాల ఆరోగ్యం పాడయ్యే అవకాశంతో పాటు దంతాల అందంపై కూడా చెడు ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేడి అహారం తినడం వల్ల నాలుక కాలుతుంది.
ఇలా చేస్తే నోటి లోపల సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు ఆహారం తీసుకునే సమయంలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందువల్ల చల్లని ఆహారం మాత్రమే తీసుకుంటే మంచిది. మరీ వేడిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. వేడి ఆహారం పొట్ట లోపలి సున్నితమైన చర్మాన్ని దెబ్బ తీసి కడుపులో నొప్పి, మంట కలుగజేస్తుంది.