Vegetables: ప్రస్తుత కాలంలో తినే ఆహార పదార్థాలు కూడా పరోక్షంగా ఎన్నో వ్యాధులకు కారణమవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత చాలామంది తమ ఆహారపు అలవాట్లను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు. రుచి కంటే ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహార పదార్థాలకే ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో ఆరోగ్యానికి హాని కలగకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు. కూరగాయలను వండేముందు శుభ్రం చేస్తారనే సంగతి తెలిసిందే.
పొట్టలోకి ఈ విధంగా చేరిన కెమికల్స్ వల్ల కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు వాంతులు, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కూరగాయలను నీళ్లతో కడగడం వాటిని శుభ్రం చేయడం కొరకు స్పాంజ్ లేదా బ్రష్ ను వాడటం చేయాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
కూరగాయలలో ఎక్కడైనా పగిలి ఉంటే వాటిని తీసివేస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరలను మాత్రం పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆకుకూరలలో ఉండే పురుగులు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చేతులు శుభ్రం చేసుకుని మాత్రమే కూరగాయలను శుభ్రం చేస్తే మంచిది.