Singer Music Director: పుకార్లకు తెలుగు సినిమా రంగంలో అసలు కొదవే లేదు. ఎక్కడో ఓ చోట ఏదో రకంగా ఏవేవో పుకార్లు పుడుతూనే ఉంటాయి. అయినా, ఆ పుకార్లలో అసలు నిజం ఉండదు అని సినిమా వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే, వాటిల్లో కచ్చితంగా నిజం ఉందని, వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు బలంగా వాదిస్తూ ఉంటారు. సాధారణంగా సినిమాల్లో పని చేస్తూ వుంటే గ్యాసిప్ లకు ఆస్కారం ఎక్కువ.

కానీ ఆ ఆస్కారానికి ప్రధాన కారణం మాత్రం వాళ్ళ ప్రవర్తనే. అయినా నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తోంది ? కొంచెం అయినా నిప్పు వుంటూనే పొగ పుడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పేరున్న ఓ మ్యూజిక్ డైరక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పుకారు బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమిటి అంటే అది.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమలో పడ్డాడట. ప్రేమలో పడింది కూడా ప్రముఖ సింగర్ తో.
ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సింగర్ ఇద్దరూ కలిసి స్వర సాధన సాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని టాక్. అయితే, సదరు మ్యూజిక్ డైరెక్టర్ పై గతంలో కూడా ఇలాంటి గ్యాసిప్ లు చాలా వచ్చాయి. ఇక ఈ సింగర్ గారి గురించి బోలెడు పుకార్లు వినిపించాయి. అయినా వీరిద్దరూ ఎప్పుడు స్పందించలేదు. తమకు నచ్చినట్టు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ పై క్రేజీ అప్ డేట్
ఐతే, ఇప్పటికే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఆల్రెడీ పెళ్లి అయింది. ఆ సింగర్ కి కూడా పెళ్లి అయింది. అయినా వీరిద్దరూ తమ బంధాన్ని విచ్చలవిడిగా ఇలా కొనసాగించడం నిజంగా షాకింగే. అయినా వీరిద్దరూ తమకు పెళ్లయిందనే విషయాన్ని మరిచిపోయి, ఇలా ప్రేమ లోతుల్లోకి జారిపోతూ పబ్లిక్ గా పుకార్లకు నాంది పలకడం ఏమిటో ? ఈ అనుబంధాలు ఇంకా ఎన్నాళ్ళో… చూడాలి.
Also Read:ఈ మధ్య కాలంలో అతి పెద్ద డిజాస్టర్ ఇదే !